Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో మహిళపై లైంగికదాడికి యత్నం... నిందితుడు బిహార్ వాసి!!

వరుణ్
బుధవారం, 10 జులై 2024 (11:48 IST)
సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో మహిళా ప్రయాణికురాలిపై ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. ఈ క్రమంలో మహిళ రైలు నుంచి కిందపడడంతో ఆమెకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో మిర్యాలగూడ స్టేషన్‌కు చేరుకుంటున్న సమయంలో రైలు వేగం తగ్గింది.
 
అదే సమయంలో ఎస్-2 బోగీలో ఉన్న ఓ మహిళ వాష్ రూము నుంచి తన సీటు వద్దకు వెళ్తుండగా మద్యం మత్తులో డోర్ వద్ద ఉన్న యువకుడు ఆమె నడుము పట్టుకుని కిందికి లాగాడు. దీంతో ఆమె కిందపడిపోయింది. రైలు కొద్దిదూరం వెళ్లిన తర్వాత యువకుడు కూడా కిందపడ్డాడు. కిందపడిన మహిళ నడుచుకుంటూ సమీపంలోని తండా వద్దకు వెళ్లి విషయం చెప్పింది. 
 
వారు రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో వారొచ్చి అంబులెన్స్‌లో బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. అలాగే, రైల్వే పట్టాలపై పడి ఉన్న నిందితుడిని కూడా గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అతడిని ఒడిశాకు చెందిన బిశ్వాస్‌గా గుర్తించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బాధితురాలు ఓ ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తున్నట్టు తెలిసింది. ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం