Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చేపల కూర, చికెన్ ఫ్రై వండటం వచ్చా.. అయితే కలుద్దాం.. ఎస్సైపై వీఆర్‌

Advertiesment
woman

సెల్వి

, మంగళవారం, 9 జులై 2024 (10:40 IST)
తెలంగాణ పోలీసుల ప్రతిష్ఠను దిగజార్చాడు ఓ నల్గొండ జిల్లా ఎస్సై ప్రవీణ్ కుమార్. ప్రస్తుతం నల్గొండ, శాలిగౌరారం ఎస్సై ప్రవీణ్ కుమార్‌పై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. 
 
భర్త నుంచి విడిపోయి ఓ కేసు విషయం కోసం స్టేషన్‌కు వచ్చిన ఆమెపట్ల ఎస్సై అభ్యంతరకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తన భర్త తనను వదిలేసి వేరొక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. దీనిపై స్టేషన్‌లో కేసు పెట్టాను. ఆపై సెటిల్మెంట్ పేరుతో తన పిల్లల పేరుతో కొంత భూమిని రాసిస్తానని పెద్ద మనుషులతో చెప్పించారు.
 
ఇదే విషయాన్ని ఎస్సై ప్రవీణ్ కుమార్‌తోనూ ఫోన్‌లో చెప్పించారు. దీనిపై ఎస్సైని తండ్రితో వెళ్లి కలిశాను. ఆ తర్వాత నాతో పర్సనల్‌గా మాట్లాడాలని చెప్పి మా డాడీని, పెద్ద మనిషిని బయటకు పంపాడు. లేడీ కానిస్టేబుల్ లేకుండానే ఎస్సై నన్ను ఈ ప్రశ్నలు అడిగాడు. 
 
చేపల కూర, చికెన్ ఫ్రై వస్తే పర్సనల్‌గా బయట కలుద్దాం అని చెప్పాడు. అనంతరం స్టేషన్‌లోనే నాతో గ్రీన్ టీ పెట్టించాడు. ఆ తర్వాత కంప్లైంట్ పేపర్‌లో నా ఫోన్ నెంబర్ తీసుకొని ఆయన పర్సనల్ ఫోన్ నుంచి మిస్డ్ కాల్ ఇచ్చాడు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా.. కాల్ చేయాలని వక్రబుద్ధితో మాట్లాడాడు. 
 
మరుసటి రోజు నుంచి ఫోన్ కాల్స్, మెసేజ్‌లతో వేధించడం మొదలెట్టాడు. ఇదే విషయాన్ని గతంలో నేను ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అందుకే మరోసారి ఫిర్యాదు చేశానని బాధితురాలు చెప్పింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం కావటంతో జిల్లా ఎస్పీ యాక్షన్‌లో దిగారు. ఎస్సై ప్రవీణ్ కుమార్‌ను వీఆర్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీడీపీ ప్రయోజనాలే రహస్య అజెండాగా చంద్రబాబు తెలంగాణ పర్యటన : విజయశాంతి