Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీ కోర్టులో కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ : డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ అంటే ఏమిటి?

Advertiesment
kavitha

వరుణ్

, సోమవారం, 8 జులై 2024 (12:32 IST)
ఢిల్లీ మద్యం కొత్త పాలసీ కుంభకోణంలో అరెస్టు అయి గత కొన్ని నెలలుగా తిహార్ జైలులో ఉంటున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కె.కవిత మరోమారు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ దఫా ఆమె డిఫాల్ట్ బెయిన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఢిల్లీ హౌస్ అవెన్యూ కోర్టులో ఆమె తరపు న్యాయవాదులు పిటిషన్‌‍ను దాఖలు చేశారు. ఈ మద్యం స్కామ్ కేసులో కవిత మధ్యంతర బెయిల్ కోసం పలుమార్లు కోర్టును ఆశ్రయించారు. కానీ ఆమెకు ప్రతిసారీ చుక్కెదరవుతూ వచ్చింది. ఇప్పటికే పలుమార్లు బెయిల్ పిటిషన్ తిరస్కరించడం, తాత్కాలిక బెయిల్ మంజూరు కూడా చేయకపోవడంతో ఆమె తరపు న్యాయవాదులు ఈ డిఫాల్ట్ బెయిల్‌ను దాఖలు చేశారు. నిర్ణీత వ్యవధిలోగా సీబీఐ దర్యాప్తు పూర్తిచేయలేక పోయిందని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ క్లయింట్‌కు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని వారు కోర్టును ఆశ్రయించారు. 
 
నిర్ణీత వ్యవధిలోగా పోలీసులు, దర్యాఫ్తు సంస్థలు కేసు విచారణ పూర్తిచేయడంలో విఫలమైతే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తికి బెయిల్ పొందే హక్కును క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్ పీసీ) కల్పిస్తోంది. సీఆర్ పీసీ సెక్షన్ 167(2) ప్రకారం.. నిర్దిష్ట గడువులోగా విచారణ పూర్తిచేసి చార్జిషీట్ దాఖలు చేయడంలో పోలీసులు విఫలమైతే బెయిల్ పొందే హక్కు నిందితులకు ఉంటుంది. అయితే, ఇది కేసు తీవ్రతను బట్టి దర్యాఫ్తు గడువు వేర్వేరుగా ఉంటుంది. 
 
సాధారణంగా నిందితులను అరెస్టు చేసిన తర్వాత 24 గంటల్లో విచారణ పూర్తిచేయడం సాధ్యం కాదని పోలీసులు భావిస్తే నిందితులని కోర్టులో ప్రవేశ పెట్టి కస్టడీకి కోరాల్సి ఉంటుంది. జడ్జి 15 రోజుల వరకు కస్టడీకి (పోలీస్ లేదా జ్యుడీషియల్) అప్పగిస్తారు. ఆ గడువులోగా కూడా విచారణ పూర్తికాకుంటే కేసు తీవ్రతను బట్టి కస్టడీ గడువును జడ్జి పొడిగిస్తారు. మరణశిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష లేదా కనీసం పదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉన్న కేసుల్లో కస్టడీ గడువు గరిష్ఠంగా 90 రోజులు.. మిగతా కేసుల విషయంలో.. దర్యాఫ్తు అధికారి/ సంస్థ మరో అత్యవసర కేసును కూడా విచారిస్తుంటే గరిష్ఠంగా 60 రోజుల కస్టడీ విధించవచ్చు. 
 
ఈ గడువు పూర్తయినా కూడా కేసు విచారణ కంప్లీట్ కాని సందర్భంలో నిందితులు పొందే చట్టబద్ధమైన హక్కునే డిఫాల్ట్ బెయిల్ అంటారు. కవిత కేసుకు సంబంధించి ఈ గడువు పూర్తవడంతో ఆమె తరఫున లాయర్లు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబుతో గోడు చెప్పుకున్న టి. నిరుద్యోగులు.. రేవంతన్నకు చెప్పండి ప్లీజ్! (video)