తెలంగాణలో నిరుద్యోగుల ఆందోళనలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్టీఆర్ భవన్ వద్ద ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబును కలిసేందుకు.. తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగులు ఎన్టీఆర్ భవన్ వెళ్లారు. చంద్రబాబును చుట్టుముట్టిన తెలంగాణ నిరుద్యోగులు.. ఆపై చంద్రబాబును కలిసి.. తమ వినతిపత్రాలు అందించారు. 
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	 
	చంద్రబాబుకు అందించిన వినతి పత్రాల్లో.. "చంద్రబాబు గారూ.. మీరైనా మా సమస్యల గురించి రేవంత్ రెడ్డికి చెప్పండి ప్లీజ్.." అంటూ తమకున్న సమస్యలను ప్రస్తావించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువు సమానులని.. ఆయన చెప్తే వింటారంటూ.. సోషల్ మీడియాలో యువత పోస్టులు పెడుతున్నారు. 
 
									
										
								
																	
	 
	తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం (జులై 5న) రాత్రి హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు.. శనివారం (జులై 06న) రోజున ప్రజాభవన్‌లో ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ అయ్యారు. 
 
									
											
							                     
							
							
			        							
								
																	
	 
	జులై 7 ఆదివారం కూడా హైదరాబాద్‌లోనే ఉన్న చంద్రబాబు.. ఎన్టీఆర్ భవన్‌లో టీటీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామంటూ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.