Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

ఠాగూర్
గురువారం, 21 ఆగస్టు 2025 (12:05 IST)
కడప జిల్లా ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ మరోసారి వార్తల్లోకెక్కింది. ఈ క్యాంపస్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బాత్‌రూమ్‌లోని కిటికీకి ఓ విద్యార్థి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనతో క్యాంపస్‌లో విషాదం నెలకొంది. 
 
వివరాలను పరిశీలిస్తే, ఇడుపులపాయ ట్రిపుల్‌‍ ఐటీ ప్రాంగణంలోని ఒంగోలు ట్రిపుల్ ఐటీలో పీయూసీ-2 చదువుతున్న విద్యార్థి నరసింహనాయుడు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీద్ పేటకు చెందిన ఈ విద్యార్థి సెల్‌ఫోన్‌కు బానిస కావడం, తండ్రి ఇదివరకే మరణించి ఉండటం వంటి కారణాల వల్ల బాత్రూమ్‌లోని కిటికీకి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. విద్యార్థి మృతదేహాన్ని వేంపల్లి 50 పడకల ఆస్పత్రికి తరలించారు. డైరెక్టర్ కుమారస్వామి గుప్తా విద్యార్థి తల్లికి సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. 
 
ఈ క్యాంపస్‍లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ఇది మొదటిసారికాదు. గత యేడాది అంతకుముందు కూడా వివిధ కారణాలతో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా విద్యార్థి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు ఇతర వివరాలు ఇంకా తెలియాల్సివుంది. ఇది వరకు కూడా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ పలుమార్లు వార్తల్లో నిలిచింది. గత యేడాది భద్రతా సిబ్బంది తనిఖీల్లో ఇద్దరు విద్యార్థుల వద్ద గంజాయి, సిగరెట్ ప్యాకెట్లు దొరగడం తీవ్ర సంచలనం కలిగించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments