Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పులివెందులలోనే కాదు.. ఒంటిమిట్టలోనూ టీడీపీ జయకేతనం

Advertiesment
tdp flag

ఠాగూర్

, గురువారం, 14 ఆగస్టు 2025 (15:52 IST)
కడప జిల్లాలో జరిగిన రెండు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. ఇప్పటికే పులివెందులలో తిరుగులేని విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించిన టీడీపీ... ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించింది. ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి 12780 ఓట్లు రాగా, వైకాపా అభ్యర్థి సుబ్బారెడ్డికి 6513 ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కృష్ణారెడ్డి వైకాపా అభ్యర్థిపై 6267 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. వైకాపా అధినేత జగన్ గడ్డపై రెండు జడ్పీటీసీలను టీడీపీ స్వీప్ చేయడంతో టీడీపీ శ్రేణుల్లో సంబరాల్లో మునిగిపోయారు. అయితే, పులివెందులలో వైకాపా అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కలేదు. దీంతో వైకాపా శ్రేణులు నిరాశలో మునిగిపోయారు. ఈ ఓటమిని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. 
 
వైఎస్ కంచుకోటలో తెలుగుదేశం జెండా రెపరెపలు 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం నమోదైంది. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. వైకాపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డాలో టీడీపీ అందరి అంచనాలను మించిపోయింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి (బీటెక్ రవి భార్య) 6,050 ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. వైకాపా అభ్యర్థి హేమంత్ రెడ్డి మాత్రం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. 
 
పులివెందుల ఉప ఎన్నికల్లో మొత్తం 8,103 ఓట్లు పోలయ్యాయి. ఇందులో మారెడ్డి లతారెడ్డికి 6,735 ఓట్లు పోలుకాగా, వైకాపా అభ్యర్థి హేమంత్ రెడ్డిక కేవలం 685 ఓట్లు మాత్రమే వచ్చాయి. వైకాపా, టీడీపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుందని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ హేమంత్ రెడ్డి ఏమాత్రం కనీస పోటీ కూడా ఇవ్వలేక చివరకు ధరావత్తును కూడా కోల్పోయారు. జగన్ గడ్డపై టీడీపీ ఘన విజయం సాధించడంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఘోర పరాభవంతో వైకాపా శ్రేణులు డీలాపడ్డాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అహంకారంతో ఉన్న జగన్‌ను ఆకాశం నుంచి కిందికి దించాం : బీటెక్ రవి