Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళను వాహనంతో ఢీకొట్టించి.. సామూహిక అత్యాచారం...

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2022 (08:43 IST)
ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. కాయగూరలు అమ్ముకుని ఇంటికి వెళుతున్న ఓ మహిళపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒంటరిగా ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఆమెను వెంబడించి, వాహనంతో ఢీకొట్టించి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ దారుణం జిల్లాలోని ఒంగోలు మండలం, కొప్పోలు - గుత్తికొండవారిపాలెం గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన కథనం మేరకు... ఓ వివాహిత రోజూ ఒంగోలుకు ద్విచక్రవాహనంపై వచ్చి కూరగాయలు అమ్ముకుని తిరిగి వెళ్లేది. మంగళవారం రాత్రి 10.30 సమయంలో ఆమె స్వగ్రామానికి వెళ్తుండగా మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై ఆమెను వెంబడించారు. 
 
నిర్మానుష్య ప్రాంతంలో ఆమె వాహనాన్ని ఢీకొట్టి, మహిళను పక్కనున్న పొదల్లోకి లాక్కెళ్లారు. ఆమె కేకలు వేస్తూ ప్రతిఘటించినా వదల్లేదు. అత్యాచారానికి పాల్పడిన దుండగులు.. ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యారు. ఆలస్యమవుతున్నా ఆమె ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఆమెను వెతుక్కుంటూ వచ్చారు. 
 
దారిలో తారసపడిన ఆమె.. తనపై ఇద్దరు యువకులు దాడిచేసి అత్యాచారానికి పాల్పడినట్టు చెప్పారు. నిందితుల కోసం బంధువులు గాలిస్తుండగా కొత్తపట్నం రోడ్డులోని ఒక పెట్రోల్‌బంకు సమీపంలో కనిపించారు. పట్టుకునేలోపే అక్కడి నుంచి పరారయ్యారు. 
 
దీనిపై బాధితురాలు బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు, తాలూకా సీఐ వి.శ్రీనివాసరెడ్డి బాధితురాలిని విచారించి వివరాలు సేకరించారు. సంఘటన స్థలానికి గురువారం చేరుకుని పరిశీలించారు. బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. కొప్పోలు గ్రామంలో చేపల చెరువు వద్ద కాపలాగా ఉన్న ఇద్దరు వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరోమారు వాయిదాపడిన 'హరిహర వీరమల్లు'.. ఆ తేదీ ఫిక్స్!

గౌరీతో పాతికేళ్ల స్నేహబంధం - యేడాదిగా డేటింగ్ చేస్తున్నా : అమీర్ ఖాన్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments