Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో.. ఇలా కూడా చేస్తారా... ట్రాఫిక్ సిగ్నల్ బ్యాటరీలు చోరీ

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (09:31 IST)
హైదరాబాద్ నగరంలో వివిధ రకాలైన నేరాలు పెరిగిపోతున్నాయి. వీటిని అదుపు చేయడం పోలీసులకు కత్తిమీదసాములా మారింది. ముఖ్యంగా, నగరంలో నేర నియంత్రణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ నేరాలు చేసేవారితో పాటు నేరాలు చేసే వారి సంఖ్య కూడా ఏమాత్రం తగ్గడం లేదు. 
 
తాజాగా రాత్రివేళల్లో ఏకంగా నడిరోడ్డుపై ట్రాఫిక్​ పోలీసు రద్దీ నియంత్రించే కూడలి ప్రాంతంలో ట్రాఫిక్​ సిగ్నల్​ బ్యాటరీలను దొంగిలిస్తున్నారు. ఈ చోరీలు గత కొంత కాలంగా సాగుతున్న పోలీసులకు చిక్కడంలేదు. ఏట్టకేలకు పోలీసులు పక్కా స్కెచ్​ వేసి దొంగలను పట్టుకున్నారు. 
 
హైదరాబాద్ నగరంలోని గత కొంత కాలంగా వివిధ ప్రాంతాల్లో వరుసగా ట్రాఫిక్ సిగ్నల్ బ్యాటరీల దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకొని తిరుగుతున్న నిందితులను వలపన్ని అబిడ్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అబిడ్స్ పోలీస్​ స్టేషన్ పరిధిలో సిబ్బందితో కలిసి పట్టకున్నారు. 
 
వీరిని షేక్ అజీముద్దిన్ అలియాస్ అజీమ్, జంగాల మద్దిలేటి అను అనే నిందితులు బేగంబజార్, బేగంపేట్, కాచిగూడ, లంగర్​హౌజ్, హబీబ్​నగర్, గోపాలపురం, మలక్​పేట, షహినయాత్గాంజ్, సైఫాబాద్ ప్రాంతాల్లోని ట్రాఫిక్ సిగ్నల్ బ్యాటరీలను చోరి చేసినట్టు పోలీసులు వెల్లడించారు. 
 
ఇలా చోరీ చేసిన బ్యాటరీల్లో 26 పెద్ద బ్యాటరీలు, 48 చిన్న బ్యాటరీలు ఉన్నాయని వెల్లడించారు. వీటి విలువ దాదాపు రూ.5 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. వీరిపై హైదరాబాద్ నగరంలో చైతన్యపురి పోలీస్ స్టేషన్లలో 11 కేసులపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యాయని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments