Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిలేని బాలికను గర్భవతిని చేసిన ఫాస్టర్

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (14:36 IST)
కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. తల్లిలేని 17 యేళ్ళ బాలికను అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. దీంతో ఆ బాలిక తొమ్మిది నెలలు నిండటంతో గత నెల 5వ తేదీన మగబిడ్డకు జన్మనిచ్చింది. పైగా, తాను చేసిన నేరం బయటపడకుండా ఉండేందుకు వీలుగా ఆ ఫాస్టర్ బిడ్డను మాయం చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులో ఫాస్టర్ బెజవాడ హోసన్న అనే ఫాస్టర్ ఓ చర్చిని నిర్వహిస్తున్నాడు. ఈయన వద్దకు వెళ్లేవారిలో ఓ 17 యేళ్ల పాలిక కూడా ఉంది. ఆ బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకుని, గర్భవతిని చేశాడు. ఈ క్రమంలో ఆ బాలిక గత నెల 5వ తేదీన బిడ్డకు జన్మనిచ్చింది. తాను చేసిన నేరం బయటపడకుండా ఉండేందుకు వీలుగా ఆ బిడ్డను మాయం చేశాడు. 
 
నెల రోజులు గడుస్తున్నా బిడ్డ ఆచూకీ దొరక్కపోవడంతో బాధితురాలు దీనిపై ఫాస్టర్‌ను నిలదీయడంతో అసలు విషయం వెలుగు చూసింది. దీంతో బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ బాలిక బంధువులు జిల్లా కలెక్టర్‌తో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పుట్టిన బిడ్డ ఏమయ్యాడో దర్యాప్తు చేయాలని వారు కోరుతున్నారు. ఈ ఘటన చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచలనంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments