బాహుబలి స్టార్ రానా దగ్గుబాటిని వివాహం చేసుకున్న మిహీకా బజాజ్, బీచ్‌లో నడుస్తున్నట్లు కనిపించే వీడియోను పంచుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లింది. ఆ క్షణాన్ని ఫుల్‌గా ఎంజాయ్ చేసిన మికీకా అందంగా కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మిహీకా బజాజ్ గర్భవతి అని ఊహాగానాలు చేస్తున్నారు.
ఆమె గర్భవతి అని నెటిజన్ ఒకరు రాశారు. ఇక నెటిజన్లు గర్భిణీ అయిన మిహికాకు శుభాకాంక్షలు తెలిపారు. మిహీకా బజాజ్ ప్రెగ్నన్సీ గురించి గతంలో రూమర్లు కూడా వచ్చాయి. అయితే అప్పుడు తాను గర్భవతిని కానని స్పష్టం చేసింది.
ఆగస్టు 8, 2020న రానా- మిహీకా బజాజ్‌ల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇకపోతే.. మిహీకా ఎర్త్ యాంగిల్స్ అనే ఎన్జీవోలో పనిచేస్తోంది. విద్యుత్ సౌకర్యం లేని భారతదేశంలోని మారుమూల ప్రాంతాల్లోని పేద ప్రజలకు సౌరశక్తితో పనిచేసే లైట్లను పంపిణీ చేయడానికి ఆమె ఈ సంస్థతో కలిసి పని చేస్తోంది.