Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.150 కోసం బండరాయితో కొట్టి చంపేశారు... సైకో మృత్యుకేళి

Webdunia
గురువారం, 11 మే 2023 (09:59 IST)
పల్నాడు జిల్లా నరసారావు పేటలో జంట హత్యలు చోటుచేసుకున్నాయి. ఇవి స్థానికంగా కలకలం సృష్టించాయి. ఈ జంట హత్యల్లో మృతులిద్దరినీ కేవలం రూ.150 కోసం బండరాయితో కొట్టి చంపేశారు. నరసారావు పేట రైల్వే స్టేషన్ రోడ్డులో ఈ జంట హత్యలు జరిగాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
రైల్వే స్టేషన్ రోడ్డులో మృతి చెందిన ఇద్దరు మద్యం సేవించి మరణించివుంటారని భావించారు. అయితే, జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి రంగంలోకి దిగి స్థానికంగా ఉండే సీసీ టీవీ కెమెరాల ఫుటేజీలను విశ్లేషించగా, అవి హత్యలుగా తేలింది. ఆ తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు.. అసలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జిల్పా ఎస్పీ పర్యవేక్షణలో జంట హత్యలు జరిగిన కొన్ని గంటల్లోనే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
 
ఈ హత్యలకు పాల్పడింది. తన్నీరు అంకమ్మరావుగా గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన అంకమ్మరావు గత జూన్ నలలో నగదు కోసం ఓ మహిళను హతమార్చిన కేసులో అరెస్టయ్యాడు. సాక్ష్యాధారాలు లేక పోవడంతో మార్చిలో జైలు నుంచి బయటకువచ్చాడు. 
 
అలాగే, బుధవారం తెల్లవారుజామున రైల్వేస్టేషన్ రోడ్డులో పడుకుని ఉన్న తెలంగాణలోని మహబూబాబాద్‌కు చెందిన సంతోష్ రెడ్డి (45)ని బండ రాయితో మోది హతమార్చి అతని వద్ద ఉన్న రూ.30 దోసుకున్నాడు. 
 
ఆ తర్వాత సమీపంలోనే మరో గుర్తు తెలియని వ్యక్తిని కూడా ఇదే తరహాలో చంపి అతని వద్ద ఉన్న రూ.120 తీసుకున్నాడు. కాగా, విచారణ సమయంలో ఈ నెల 5న మార్కెట్ సెంటరులో 400 కోసం ఓ మహిళను హతమార్చినట్లు ఈ సైకో కిల్లర్ అంగీకరించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments