Publish Date: Mon, 17 Apr 2023 (07:36 IST)
Updated Date: Mon, 17 Apr 2023 (07:37 IST)
పదో తరగతి పరీక్ష రాసి ఇంటికి వెళుతున్న ఓ బాలికపై కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. తన భర్త చేసిన పాడుపని తెలుసుకున్న కానిస్టేబుల్ భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ఉమ్మడి గుంటూరు జిల్లా పిడుగురాళ్ల వద్ద జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఏపీలో పదో తరగతి పరీక్షలు శనివారంతో పూర్తయ్యాయి. ఈ పరీక్షలను పల్నాడుకు సమీపంలోని గురజాల ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి కూడా రాసింది. పరీక్ష పూర్తయిన తర్వాత ఆ బాలికను దాచేపల్లి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ సమీపంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ బాలిక ఇంటికి ఆలస్యంగా వెళ్లిందిం. దీంతో తల్లిదండ్రులు బాలికను నిలదీశారు.
ఇంత ఆలస్యమెందుకు అయ్యిందంటూ నిలదీయడంతో అసలు విషయం చెప్పింది. ఆ తర్వాత కుటుంబ సభ్యుల సాయంతో పిడుగురాళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కానిస్టేబుల్ నాగరాజును అదుపులోకి తీసుకున్నారు.
తన భర్త చేసిన పాడు పని తెలుసుకున్న కానిస్టేబుల్ భార్య అనూష ఆత్మహత్యకు యత్నించింది. ఆమె ఇంట్లో ఉరి వేసుకోగా, దాన్ని గమనించిన కుటుంబ సభ్యులు సకాలంలో ఆమెను రక్షించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
ఠాగూర్
Publish Date: Mon, 17 Apr 2023 (07:36 IST)
Updated Date: Mon, 17 Apr 2023 (07:37 IST)