మైనర్లపై పెరుగుతున్న లైంగిక అకృత్యాలు.. హైదరాబాదులో డ్యాన్స్ మాస్టర్.. ఏపీలో వాచ్‌మెన్

సెల్వి
గురువారం, 6 నవంబరు 2025 (13:27 IST)
హైదరాబాద్‌లో దారుణం బయటపడింది. బోయిన్ పల్లిలో డాన్స్ స్కూల్ నిర్వహిస్తున్న మాస్టర్ జ్ఞానేశ్వర్ సుబ్బు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రెండు నెలలుగా తన వద్దకు డాన్స్ నేర్చుకోవడానికి వచ్చిన నాలుగేళ్ళ చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. 
 
ఎవరూ లేని టైమ్‌లో పాపతో అసభ్యంగా ప్రవర్తించాడు. లైంగికంగా హింసించాడు. దీంతో డ్యాన్స్ స్కూలుకు వెళ్లనని తల్లిదండ్రులతో చెప్పింది. కానీ వారు ఏమైందని గట్టిగా ప్రశ్నించగా అసలు విషయం వెల్లడించింది. దీంతో పాప పేరెంట్స్ వెంటనే డాన్స్ మాస్టర్ సుబ్బు మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు జ్ఞానేశ్వర్ ను అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. జ్ఞానేశ్వర్‌ను రిమాండ్‌కు తరలించామని.. స్టూడియోను సీజ్‌ చేశామని తెలిపారు. 
 
ఇదే తరహాలో ఏపీ, తిరుపతి ఉన్న బాలుర వసతి గృహంలో దారుణం జరిగింది. అక్కడ పనిచేసే నైట్ వాచ్‌మెన్ ఇద్దరు మైనర్ బాలురపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. రాత్రి సమయంలో ఆ వాచ్‌మెన్ ఆ బాలురను తన రూమ్‌కు తీసుకొచ్చి, తలుపు లాక్ చేశాడు. 
 
ముందుగా ఆ మైనర్ బాలురకు బ్లూ ఫిల్మ్‌లు చూపించి.. అనంతరం వారి దుస్తులు విప్పి, తాను కూడా తన పంచె విప్పి ఆ చిన్నారులపై లైంగిక వాంఛ తీర్చుకున్నట్లు బాలుడు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే తల్లిదండ్రులు వసతి గృహం వార్డెన్‌కు సమాచారం అందించారు. అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గౌతమి చౌదరి వర్సెస్ ధర్మ మహేష్.. భార్యపై కేసు పెట్టాడు.. కారణం ఏంటంటే?

Sudheer Babu: ఇండస్ట్రీ బ్యాగ్రౌండ్ లేనివారికి కష్టం, అందుకే అలా మాట్లాడా : హీరో సుధీర్ బాబు

Chinmayi: సజ్జనార్‌కు ఫిర్యాదు చేసిన చిన్మయి శ్రీపాద

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం