Webdunia - Bharat's app for daily news and videos

Install App

సికింద్రాబాద్ కార్ఖానాలో మరో బాలికపై అత్యాచారం

Webdunia
మంగళవారం, 7 జూన్ 2022 (13:24 IST)
తెలంగాణ రాష్ట్రంలో వరుస అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికే జూబ్లీహిల్స్‌లోని ఆమ్నేషియా క్లబ్ వద్ద కారులో ఓ మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇది మరిచిపోక ముందే హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో పుట్టిన రోజు వేడుకల పేరుతో ఓ బాలికను తీసుకెళ్లి కారులోనే అత్యాచారం చేశారు. 
 
ఇపుడు సికింద్రాబాద్‌ పరిధిలో మైనర్‌ బాలికపై జరిగిన సామూహిక అత్యచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కార్ఖానా పరిధిలో బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. 
 
బాలికతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకున్న నిందితులు ధీరజ్‌, రితేశ్‌ బాలికకు మాయమాటలు చెప్పి శారీరకంగా లోబర్చుకున్నారు. అత్యాచారం చేసిన సమయంలో వీడియోలు తీసి ధీరజ్‌, రితేశ్‌ బాలికను భయపెట్టారు. వీడియోలు ఇస్తానని చెప్పి పిలిచి ఇతర స్నేహితులతో కలిసి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఈ ఘటన దాదాపు రెండు నెలల క్రితం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాలిక పరిస్థితి చూసి ఆమె కుటుంబసభ్యులు మానసిక నిపుణుడి దగ్గరికి తీసుకెళ్లారు. మానసిక నిపుణుడి వద్ద బాలిక జరిగిన విషయం చెప్పింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు మే 30వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments