Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బసేరా హోటల్ పబ్‌లో అశ్లీల నృత్యాలు.. పోలీసుల అదుపులో యువతులు

Advertiesment
pub culture
సింకిద్రాబాద్‌లోని బసేరా హోటల్‌లోని పబ్‌లో అశ్లీల నృత్యాలు సాగుతున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో ఆ పబ్‌పై ఆకస్మిక దాడిచేసిన పోలీసులు అశ్లీల డ్యాన్సులు చేస్తున్న అనేక మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. 
 
నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారంతో ఈ తనిఖీలు చేశారు. ఆ తర్వాత పలువురు డ్యాన్సర్లు, పబ్ నిర్వాహకులతోపాటు పది మంది యువతులు, 28 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ఇటీవల రాంగోపాల్‌పేట టకీలా పబ్‌పై పోలీసులు దాడి చేసిన ఘటనపై మరువక ముందే బసేరా హోటల్‌లోని ఓట్ స్వింగర్స్ పబ్‌పై దాడి చేసి డ్యాన్సర్లు, నిర్వాహకులు, యువతులను అదుపులోకి తీసుకోవడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రక్కును ఢీకొన్న అంబులెన్స్ - ఏడుగురు మృతి