Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

ఐవీఆర్
బుధవారం, 11 జూన్ 2025 (20:32 IST)
పెళ్లై నెల కూడా తిరగక ముందే ప్రియుడి కోసం భర్తను హత్య చేయించిన భార్య సోనమ్ రఘువంశీ సోదరుడు గోపీచంద్ బుధవారం రాజా రఘువంశీ తల్లిని ఓదార్చారు. అతడిని చూడగానే రాజా తల్లి బోరుమంటూ విలపించింది. గోపీచంద్ కూడా కన్నీటిపర్యంతమయ్యాడు. తన సోదరి సోనమ్ తప్పు చేసిందనీ, ఆమెకి మరణశిక్ష విధించాలంటూ చెప్పాడు. 
 
నాకు ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్ళి చేస్తున్నారు, ఆ తర్వాత నేను ఏం చేస్తానో చూడు అంటూ తన తల్లిని సోనమ్ రఘువంశీ హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. రాజా రఘువంశీతో తనకు పెళ్లి ఇష్టం లేదని, బలవంతంగా వివాహం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని సోనమ్ తన తల్లిని ముందే హెచ్చరించిందట. 
 
నాకు ఇష్టంలేదని చెబుతున్నా వినకుండా బలవంతంగా పెళ్లి చేస్తున్నారు. తర్వాత మీరే విచారిస్తారు అని సోనమ్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. రాజ్ కుశ్వాహాను ప్రేమిస్తున్నా అతడినే పెళ్లి చేసుకుంటానని చెప్పినా సోనమ్ తల్లి వినిపించుకోలేదట. తన ప్రేమను అంగీకరించలేదని, తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని సోనమ్ ఆగ్రహంతో రగలిపోయిందని సమాచారం. 
 
"నేను ఆ మనిషి(రాజా రఘువంశీ)ని ఏం చేస్తానో చూడండి. దాని పర్యావసానాలు మీరు కూడా అనుభవించాల్సి ఉంటుంది" అంటూ సోనమ్ తన తల్లిని బెదిరించింది. అయినా తల్లి వినకపోవడంతో బలవంతంగా తాళి కట్టించుకున్న సోనమ్, ఆ తర్వాత వారం రోజులకే రాజా రఘువంశీని హత్య చేయించింది. తాజాగా ఈ వివరాలను రాజా రఘువంశీ సోదరుడు విపిన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. అయితే, ఇలా హత్య చేయిస్తుందని ఎవరూ ఊహించలేదని అన్నారు. 
 
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన సోనమ్ రఘువంశీ(24), రాజా రఘువంశీ(29)లకు మే 11వ వివాహం జరిగింది. అయితే, తమ కుటుంబ వ్యాపారంలో అకౌంటెంట్‌గా పని చేస్తున్న రాజ్ కుష్వాహాతో సోనమ్‌కు అంతకుముందే ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ విషయాన్ని సోనమ్ తన తల్లికి చెప్పి, రాజాను పెళ్లి చేసుకోనని స్పష్టం చేసింది. అయినప్పటికీ తల్లి ఆమె ప్రేమను వ్యతిరేకించింది. కుమార్తెకు నచ్చజెప్పి తమ కులానికి చెందిన రాజాతో పెళ్లి చేసింది. 
 
పెళ్లయిన తర్వాత మే 23వ తేదీన రాజా, సోనమ్ హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. అక్కడ ఓ హోమ్‌ స్టే నుంచి బయటకు వెళ్లిన తర్వాత వారిద్దరూ అదృశ్యమయ్యారు. మొదట దంపతులు కనపడటం లేదని కేసు నమోదు కాగా, జూన్ 2వ తేదీన రాజా మృతదేహం లభించడంతో ఈ కేసు దారుణమైన మలుపు తిరిగింది. విచారణలో సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహా, మరో ముగ్గురు కలిసి ఈ హత్యకు పాల్పడినట్టు తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments