Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను గెడ్డం తీయమంటే తీయట్లేదని, క్లీన్ షేవ్ చేసుకునే మరిదితో లేచిపోయిన వివాహిత

ఐవీఆర్
బుధవారం, 30 ఏప్రియల్ 2025 (18:41 IST)
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ లిసాడి గేట్ పోలీస్ స్టేషన్ ప్రాంతం నుండి ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. భర్త (Husband) ఎంత చెప్పినా గెడ్డం (Beard) తీయడం లేదని విసుగు చెందిన అతడి భార్య (wife) క్లీన్ షేవ్ (Clean shave) చేసుకుని తిరిగే మరిది (Brother in-law)తో లేచిపోయింది. ఈ కేసులో బాధిత భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు తీవ్రంగా వారిద్దరి కోసం వెతుకుతున్నారు.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఉజ్వల్ గార్డెన్ కాలనీలో నివసించే మౌలానా షకీర్, ఏడు నెలల క్రితం ఇంచౌలికి చెందిన ఒక యువతిని వివాహం చేసుకున్నాడు. షకీర్ భార్య చదువుకుంది. చదువుపై ఆమెకున్న ఆసక్తి కారణంగా, వివాహం తర్వాత కూడా ఆమె చదువు కోసం కళాశాలకు వెళ్లడం కొనసాగించింది. షకీర్‌తో వివాహం తర్వాత, ఆమె తన భర్తతో తనకు గెడ్డం అంటే ఇష్టం వుండదనీ, అందుకే అతను క్లీన్-షేవ్ చేసుకోవాలని చెప్పింది. మౌలానాను గెడ్డం తీయించమని ఒత్తిడి చేయడం ప్రారంభించింది. ఐతే మౌలానా మాత్రం గెడ్డం తీయలేదు. కొన్నాళ్లకు ఆమె సర్దుకుంటుందని లైట్ తీసుకున్నాడు.
 
కానీ తన భార్య బెడ్రూంకి చేరగానే గెడ్డం ఎప్పుడు తీస్తావూ అంటూ పదేపదే అడగటం మొదలుపెట్టింది. ఆమె మొండితనంతో కలత చెందిన మౌలానా తను గెడ్డం షేవ్ చేసుకునేది లేదని గట్టిగా చెప్పేసాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. తను చెప్పిన మాటను భర్త మౌలానా నిరాకరించడంతో కోపంతో రగిలిపోయిన ఆమె తన భర్త లేనపుడు మరిదితో సన్నిహితంగా మెలగటం ప్రారంభించింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. మరిదిని తీసుకుని ఆమె ఇంట్లో నుంచి లేచిపోయింది. వెళ్తూ వెళ్తూ ఇంట్లో ఉంచిన నగదు, నగలను తనతో తీసుకెళ్లింది.
 
బాధితుడు మౌలానా తన భార్య, తన సోదరుడితో లేచిపోయిందని తెలిస్తే పరువు పోతుందని కొన్నిరోజులు మౌనంగా వుండిపోయాడు. వాళ్లిద్దరూ తిరిగి ఇంటికి వస్తారని అనుకున్నాడు. కానీ వారి తిరిగిరాలేదు. గత మూడు నెలలుగా పరారీలో ఉన్న తన భార్య, సోదరుడి ఆచూకీ కోసం పోలీసులను ఆశ్రయించాజు. లిసాడి గేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసాడు. మౌలానా షకీర్ ఫిర్యాదు మేరకు, పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, పారిపోయిన ఇద్దరి మొబైల్ నంబర్లను ట్రేస్ చేసారు. పరారీలో ఉన్న మహిళ, ఆమె మరిది ప్రస్తుతం పంజాబ్‌లోని లూథియానాలో ఉన్నట్లు తేలింది. పోలీసులు మౌలానాకు సమాచారం ఇచ్చి, వారిద్దరినీ తిరిగి రప్పించడానికి లూథియానాకు ఒక బృందాన్ని పంపుతున్నట్లు చెప్పారు.
 
తన భార్య మొదటి నుంచీ స్వేచ్ఛా ఆలోచనాపరురాలని మౌలానా షకీర్ ఆరోపించారు. వివాహం అయినప్పటి నుండి, ఆమె తన గెడ్డం గురించి ఎగతాళి చేసేదనీ, తనతో వివాహం బలవంతంగా జరిగిందని చెప్పేది. తన గెడ్డం నచ్చకపోతే తనను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు నిరాకరించలేదని షకీర్ అడిగినప్పుడు, తన తండ్రి మరియు ఇతర కుటుంబ సభ్యుల ఒత్తిడితో వివాహం జరిగిందని తన భార్య చెప్పిందని వెల్లడించాడు. తన భార్య తనతో సంసారం చేయడానికి అంగీకరించనట్లయితే చట్టబద్ధంగా తమకు విడాకులు ఇప్పించాలంటూ బాధితుడు కోరుతున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

HIT 3 పహల్గమ్ షూట్ లో ఒకరు చనిపోవడం బాధాకరం: నాని

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రానికి భోగి టైటిల్ ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments