Webdunia - Bharat's app for daily news and videos

Install App

చదివించరనే మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య

Webdunia
గురువారం, 28 జులై 2022 (13:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆ విద్యార్థిని పేరు హరిత. ఆమె ఇంటర్‌లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. పైగా, ఎంసెట్‌లో మంచి ర్యాంకు కూడా వచ్చింది. కానీ, ఆ పై చదువులు తల్లిదండ్రులు చదివించరన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన హరిత అనే విద్యార్థిని ఎంసెట్‌లో ర్యాంకులో వచ్చింది. అయినప్పటికీ తల్లిదండ్రులు చదివించరనే మనస్తాపంతో ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. 
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు హరిత రాసిన రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments