పెద్ద నిర్మాతలు రీష్యూట్‌లు హెవీ పారితోషికాలు మానుకోండి. అప్పుడే నిర్మాణ వ్యయం తగ్గుతుంది. మీరు రూల్స్ అమలు చేయండి. మాకు చెప్పకండి నీతులు అంటూ వంద సినిమాలు నిర్మించిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ సవాల్ విసిరారు.
- ప్రస్తుతం కాస్ట్ పెరిగిపోతుందని చెప్పి షూటింగ్‌లు ఆపేస్తామంటూ ప్రెస్‌నోట్ విడుదలచేయడం ఏమిటి? అని ప్రశ్నించారు. ముందు మీరు సినిమాలు తీసే విధానం మార్చుకోండి. లక్షలు, కోట్లు ఇచ్చి పరబాషా నటీనటులను తీసుకువచ్చి వారికి సౌకర్యాలు కలిగించేవిధానంలో కొత్తదనం చూపండి అని తెలియజేశారు.
- మీ నోటివెంట భయం అనే మాట మీ అభిమానిగా నేను వినలేనని మీరు చాలా తోపు అని దిల్‌రాజు నుద్దేశించి తుమ్మలపల్లి రామసత్యనారాయణ అన్నారు.
- ఓటీటీ పేరుతో మీరే థియేటర్‌లకు ముందుగానే అమ్మేయడం, ఇప్పుడు ససేమిరా అనడం ఏమిటని ప్రశ్నించారు. టికెట్ రేటు పెంచింది మీరే. ఇప్పడు తగ్గించాలని అంటున్నారు. అప్పట్లోనే రేటు పెంచవద్దని చిన్న నిర్మాతలు చెప్పారుకదా. ఆ విషయం మీకు గుర్తులేదా అని నిలదీశారు.
- మీరు ఇండస్ట్రీని శాసించే స్థాయిలో వున్నారు. పెద్దరికం అంటగట్టారు మీకు. మీరు సినిమాలు మానేస్తే మానేయండి. కానీ మాలాంటి చిన్న నిర్మాతలను షూటింగ్ చేసుకోనివ్వండి. మీరు గిల్డ్ పేరుతో వుంటే 20 మంది వుంటారు. కానీ మేం 200 మంది నిర్మాతలం. ఈ విషయాన్ని మీరు గమనించాలని తెలిపారు.