ఆగస్టు 1నుంచి షూటింగ్ బంద్ అవడం ఆధారంలేని వార్త అని దిల్‌రాజు తేల్చిచెప్పారు. ప్రస్తుతం సినిమారంగంలోని నిర్మాతలు, దర్శకుల సమస్యలు, 24 క్రాఫ్ట్‌కు చెందిన కార్మికుల సమస్యలు అన్నింటినీ కూలంకషంగా చర్చిస్తున్నాం. అవి ఇంకా కొలిక్కి రాలేదు. నిన్న ఆదివారంనాడు చర్చలు జరిగాయి. ఇంకా పూర్తికాలేదు. మరోసారి జరుపుతాం. అప్పుడే సోషల్‌మీడియాలో రకరకాలుగా వార్తలు వచ్చేశాయి. షూటింగ్‌లు బంద్ అట. ప్రముఖ పత్రికల్లోనూ అవే రాసేశారు. ఇవన్నీ మీరిష్టం వచ్చినట్లు రాసేస్తున్నారు.
ఏదైనా చర్చలు జరుగుతుంటే పదిమందిలో రకరకాల అభిప్రాయాలు వుంటాయి. అవన్నీ కూలంకషంగా ఫైనల్ చేసి నిర్ణయాన్ని మీడియాకు చెబుతాం. ఈలోగా తొందరపడి మీకు తోచించి రాసేస్తున్నారు. మా కమిటీలోని కొందరిని మీడియా క్రేజ్ కోసం ఏంజరుగుతందంటూ.. తెగ వాట్సప్ మెసేజ్‌లు పెడుతుంటారు. మాలో సీక్రెట్‌లను బయట పెట్టేవారు లాగానే మీకున్న పరిచయాలతో వారిని ఏదో ఒకటి చెప్పేలా చేస్తున్నారు. అవతలి వ్యక్తి ఏదైనా ఓ మాట చెబితే, దాన్ని రకరకాలుగా రాసేస్తున్నారంటూ.. మీడియాపైనా చమక్కు విసిరారు.
త్వరలో అన్ని సమస్యలకు పరిష్కారం జరుగుతుంది. నిర్మాణవ్యయం గురించి మేం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. హీరోలు తగ్గించుకోవడానికి సిద్ధంగా వున్నారు. కానీ వారి దాకా విషయం తీసుకెల్ళే వారు లేరు. ఇటీవలే రామ్‌చరణ్ కూడా అడిగాడు. ఏమిటిసార్. నిర్మాణవ్యయం గురించి అని అడిగాడు. అందరికీ న్యాయం జరగాలంటే మనం ఏదో ఒకటి చేయాలి. మేం కూడా ముందుంటాం అని చెప్పారు కూడా. సో. హీరోలంతా మంచివారే. వారికి సరైనవిధంగా తెలిసేలా చేయడం ఒక్కటే మార్గం. అది త్వరలో సాధ్యం చేస్తాను అని చెప్పారు.