Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారులతో అశ్లీల వీడియోలు చిత్రీకరిస్తే జైలుపాలే : హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక

ఠాగూర్
మంగళవారం, 1 అక్టోబరు 2024 (11:18 IST)
చిన్నారులతో చిత్రీకరించిన అశ్లీల వీడియోలు డౌన్‌లోడ్ చేసి చూసినా.. వ్యాప్తి చేసినా ఇక నుంచి కటకటాలు లెక్కించేందుకు సిద్ధంగా ఉండాల్సిందే. ఇది సుప్రీంకోర్టు తీర్పు. ఫోన్, కంప్యూటర్‌లో గుట్టుగా చూస్తే ఎవరూ గుర్తించలేరనుకోవద్దు. పోలీసులు సాంకేతిక ఆధారాలతో కనిపెడుతున్నారు. వాట్సాప్ గ్రూపులు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇతరులకు పంపిస్తున్నట్లు వెలుగుచూస్తుండటంతో నియంత్రణపై రాచకొండ పోలీసులు దృష్టి సారించారు. 
 
ఇక్కడి పోలీసులే కాదు.. విదేశీ దర్యాప్తు సంస్థలు కూడా మన దేశంలో చైల్డ్ పోర్నోగ్రఫీ వ్యాప్తి చేస్తున్న వారిపై దృష్టిసారిస్తున్నాయి. అమెరికాలోని హోంల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ (హెచ్ఎస్ఐ), నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్సైటెడ్ చిల్డ్రన్స్ (ఎన్సీఎంఈసీ) తదితర సంస్థలు ఐపీ అడ్రస్‌నును కేంద్ర హోంశాఖకు అందిస్తున్నాయి. అలా వచ్చిన సమాచారంతో గత యేడాది ఒక యువకుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
 
'చిన్నారులపై లైంగిక దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. చిన్నారుల అశ్లీల దృశ్యాలు చూసినా సామాజిక మాధ్యమాల్లో ఇతరులకు పంపినా పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం ఐదేళ్ల జైలు శిక్ష పడుతుంది. చిన్నారులను మానవ మృగాల నుంచి కాపాడుకుని నేరరహిత సమాజంలో భాగస్వాములవుదాం' అని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటుడు గోవిందా తుపాకీ మిస్‌ఫైర్ - ఆస్పత్రికి తరలింపు

రజనీకాంత్‌కు అస్వస్థత.. చెన్నై అపోలో ఆస్పత్రిలో అడ్మిట్

గత జన్మలో చేసిన పాపాల వల్లే ఇదంతా.. అంతా బిగ్ బాస్ పబ్లిసిటీ కోసమా?

'దేవర' 3 రోజుల్లో రూ.304 కోట్లు? - నిజమేనా? సోషల్ మీడియాలో చర్చ!

జానీ మాస్టర్‌కు తప్పని చిక్కులు.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

కుప్పింటాకా.. మజాకా.. మహిళలకు ఇది దివ్యౌషధం..

పంది కొవ్వు నెయ్యితో ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

తర్వాతి కథనం