ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. కొద్దిరోజుల నాడే ఆయనపై సురేష్ అనే డాన్సర్ కూడా ఆరోపణలు చేశాడు. తనకు అవకాశాలు కల్పించకుండా ఏడిపిస్తున్నాడనీ, డాన్సర్ ఎలక్షన్లలో డబ్బులిచ్చి సభ్యులతో ఓటు వేయించుకున్నాడనీ ఆయన ఆరోపించాడు. ఆ తర్వాత ఆ గొడవ సద్దుమణిగింది. ఇప్పుడు తాజాగా మరో లేడీ డాన్సర్ తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడని మణికొండ సమీపంలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
దాంతో వెంటనే జనసేక లెటర్ పాడ్ లో హెడ్. కాన్ఫిక్ట్ మేనేజ్ మెంట్ జనసేన పార్టీ వేములపాటి అజయ్ కుమార్ ఇకనుంచి జానీ మాస్టర్ జనసేక కార్యక్రమాలకు దూరంగా వుండాలనీ తక్షణమే అమలు జరగాలని పేర్కొన్నారు. ఇప్పటికే పవన్ అభిమానులు జానీని పార్టీ నుంచి తొలగించాలని ఫిర్యాదులు అందాయి.
నేడు జనసేన నిర్వాహక కార్యదర్శి నాగబాబు ఇలా స్పందించారు. ఆంధ్ర, తెలంగాణాలో ప్రభుత్వాలు మహిళలకు పూర్తి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. జానీ మాస్టర్ లాంటి వాళ్ళు ఇలా మహిళలకు అన్యాయం చేస్తే తాట తీస్తాం అంటూ హెచ్చరించారు. దానితో ఒకపై జానీ మాస్టర్ జాతకం తారుమారు అయిందనేది అర్థమవుతోంది. కాగా, డాన్సర్ అసోసియేషన్ నేడు కీలక నిర్ణయాన్ని తీసుకోనున్నదని తాజా సమాచారం.