Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి తలను నరికి భార్యకు బహుమతిగా ఇచ్చిన భర్త.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (15:21 IST)
భార్యతో అక్రమ సంబంధం కొనసాగించిన వ్యక్తిని నరికి తలను భార్యకు బహుమతిగా ఇచ్చాడు ఓ భర్త. ఈ ఘటన తమిళనాడు తెన్‌కాసిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. వేలుసామి స్వస్థలం తెన్‌కాసి. ఈయన భార్య ఇసక్కి. వీరిద్దరి వివాహ జీవితం బాగానే సాగింది. ఇంతలో అదే గ్రామానికి చెందిన మురుగన్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
ఈ విషయం తెలుసుకున్న వేలుస్వామి భార్యను మందలించాడు. దీంతో భార్యభర్తల మధ్య ఏర్పడిన తగాదాతో ఇసక్కి పుట్టింటికి వెళ్లిపోయింది. 
 
తన భార్య విడిపోవడానికి మురుగనే కారణమని కోపోద్రిక్తుడైన వేలుసామి పొలంలో ఆవులను మేపుతున్న మురుగన్ వద్దకు వెళ్లి వాగ్వాదానికి దిగాడు. దీంతో కోపోద్రిక్తుడైన వేలుస్వామి కొడవలి తీసుకుని మురుగన్ తల నరికాడు. తర్వాత దానిని బ్యాగ్‌లో తీసుకుని నేరుగా భార్యకు చూపెట్టాడు. 
 
అది చూసిన ఇసక్కి, ఇరుగుపొరుగు వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని వేలుస్వామిని అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments