Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం సొంత జిల్లాలో భార్య కాలు, చెయ్యి నరికేసిన భర్త..

Webdunia
గురువారం, 16 సెప్టెంబరు 2021 (14:53 IST)
కడప జిల్లాలో దారుణం జరిగింది. అనుమానం పెనుభూతమైంది. ఫలితంగా కట్టుకున్నకాడే కిరాతకంగా ప్రవర్తించాడు. అనుమానంతో భార్య కాలు, చేయి నరికివేసి, పత్తాలేకుండా పారిపోయాడు. ఈ దారుణం కడప జిల్లా చక్రాయపేట మండలం బీఎన్ తండాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
పోలీసుల కథనం ప్రకారం.. ఇస్లావత్ నాగనాయక్, ఈశ్వరమ్మ (45) భార్యాభర్తలు. 25 ఏళ్ల క్రితం వీరికి వివాహమైంది. ఇటీవల భార్యపై అనుమానం పెంచుకున్న నాగనాయక్ ఆమెను తరచూ వేధించడం మొదలుపెట్టాడు. 
 
ఈ క్రమంలో బుధవారం ఇద్దరి మధ్య మరోమారు గొడవ జరిగింది. దీంతో విచక్షణ కోల్పోయిన నాగనాయక్ గొడ్డలితో భార్య కాలు, చేయి నరికేశాడు. వెంటనే అప్రమత్తమైన బంధువులు ఆమెను వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 
 
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడు నాగనాయక్ కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments