వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్న వేళ ప్రేమ కోసం పెళ్లైనా సరే ఓ యువతి ప్రియుడి వెంట వెళ్ళిపోయింది. ఈ ఘటన బర్మార్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బర్మార్‌కు చెందిన పంకజ్‌కు పూజ అనే యువతితో 55 రోజుల క్రితం వివాహం జరిగింది.
పూజ పెళ్లయి 2 నెలలు కూడా కాకముందే భర్తకు గుడ్ బై చెప్పి తన ప్రియుడితో వెళ్లిపోయింది. పూజకు పంకజ్‌తో పెద్దలు బలవంతంగా రెండో పెళ్లి చేశారని తెలిసింది. అప్పటికే ఆమె ఓ యువకుడిని ప్రేమించిందని, అతనితో పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని తెలిసింది.
దీంతో పూజ, ఆమె ప్రియుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రేమ పెళ్లి చేసుకోగా.. ఆమె కుటుంబ సభ్యులు ఇద్దరూ ఎక్కడ ఉన్నారో కనుక్కుని పూజను ఆమె ప్రియుడి నుంచి విడదీసి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. ఆ సమయంలోనే పంకజ్‌తో వివాహం చేశారు. పూజ ప్రేమ పెళ్లి గురించి దాచి ఈ పెళ్లి చేశారు.
అయితే ప్రియుడిని మర్చిపోలేకపోయిన పూజ భర్తను భరిస్తూ 55 రోజులు కాపురం చేసింది. ఇక తన వల్ల కాదని, తనను తీసుకెళ్లిపోవాలని పూజ తన ప్రియుడికి సమాచారం అందించింది. పూజ తన అత్త కళ్ల ముందే ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది.