లాక్కెళ్లి గదిలో బంధిస్తే.. పారిపోయేందుకు యత్నించగా హాకీ స్టిక్‌తో తలపై కొట్టారు..

ఠాగూర్
శనివారం, 28 జూన్ 2025 (14:02 IST)
కోల్‌కతా న్యాయ విద్యార్థినిపై అత్యాచారం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితురాలు పెళ్లికి నిరాకరించడం వల్లే అధికార టీఎంసీ విద్యార్థి విభాగానికి చెందిన నాయకుడు కక్షగట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడుకి సెక్యూరిటీ సిబ్బంది కూడా సహకరించడం గమనార్హం. విద్యార్థిని బలవంతంగా లాక్కెళ్లి గదిలో బంధించారు. అక్కడ నుంచి ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నిస్తే తలపై హాకీ స్టిక్‌తో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. పైగా, ఈ దారుణాన్ని బయటకు చెబితే ఆమె తల్లిదండ్రులపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపుతామని బెదిరించినట్టు నిందితురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. 
 
అంతేకాకుకుండా న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగినట్టు వైద్యులు ధృవీకరించారు. నిందితులు అత్యంత పాశవికంగా ప్రవర్తించినట్టు రిపోర్టులో తేలింది. బాధితురాలి మెడ, ఛాతిభాగాలపై పదునైన పంటిగాట్లు కూడా ఉన్నాయి. గోళ్ళతో రక్కిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆమె వ్యక్తిగత అవయవాలను కూడా తీవ్రంగా గాయపరిచారు అని ఓ సీనియర్ పోలీస్ అధికారి మీడియాకు వివరించారు. ఈ నెల 25వ తేదీన కస్బా ప్రాంతంలోని సౌత్ కోల్‌కతా న్యాయ కాలేజీలో ఈ దారుణం ఘటన జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న బాధితురాలిని నిందితులు సెక్యూరిటీ సిబ్బంది గదిలోకి లాక్కెళ్లి బంధించారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి బారి నుంచి తప్పించుకోవడానికి బాధితురాలు ప్రయత్నించగా హాకీ స్టిక్‌తో ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దారుణాన్ని బయటకు చెబితే ఆమె తల్లిదండ్రులపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపుతామని నిందితుడు బెదిరించినట్టు బాధితురాలు తన వాంగ్మూలంలో పేర్కొంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మనోజిత్ మిశ్రా (31)తో పాటు మరో ముగ్గురు నిందితులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments