Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

న్యాయ విద్యార్థినిపై అఘాయిత్యం : నలుగురి అరెస్టు

Advertiesment
arrest

ఠాగూర్

, గురువారం, 21 నవంబరు 2024 (10:30 IST)
విశాఖపట్టణంలో స్నేహం పేరుతో ఓ న్యాయ విద్యార్థినిపై అత్యాచారం చేసిన ఘటనలో సహచర విద్యార్థి, స్నేహితుడుతో పాటు అతని ముగ్గురు స్నేహితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వంశీతో పాటు అతడి స్నేహితులు ఆనంద్, జగదీశ్, రాజేశ్‌ను పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరుపరిచారు. నిందితుల్లో ముగ్గురు లా చదువుతుండగా, మరొకరు ఓ ప్రైవేటు మోటార్స్ కంపెనీలో క్యాషియ‌ర్‌గా పని చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 
 
బాధితురాలిని ప్రేమ, పెళ్లి పేరుతో వంశీ దగ్గరై నమ్మించి మోసం చేశాడు. వంశీ ఆమెపై లైంగిక దాడి చేయడంతో పాటు తన స్నేహితులతో కలిసి కూడా అత్యాచారం చేశాడు. ఈ ఘటన కలకలం రేపింది. బాధితురాలు మధురవాడలోని ఎన్వీపీ లా కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతోంది. తన సహచర విద్యార్థి వంశీతో స్నేహం చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన వంశీ... గత ఆగస్టు 10న ఆమెను కంబాలకొండకు తీసుకెళ్లాడు. 
 
అక్కడ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అదే నెల 13న తన స్నేహితుడు ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత వంశీ స్నేహితులు ఆనంద్, రాజేశ్, జగదీశ్ కూడా ఆమెపై అత్యాచారం చేశారు. ఆ దృశ్యాలను తమ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ తర్వాత ఆమెను బెదరిస్తూ పలుమార్లు అత్యాచారం చేశారు. ఈ వేధింపులను భరించలేని ఆ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా, తల్లిదండ్రులు చూసి నిలదీయడంతో అసలు విషయం వెలుగు చూసింది. దీనిపై యువతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మన్ కీ బాత్ తరహాలో డయలు యువర్ సీఎం : చంద్రబాబు వెల్లడి