Webdunia - Bharat's app for daily news and videos

Install App

కులాంతర వివాహం చేసుకుందనీ.. సోదిరిని వెంటాడి గొడ్డళ్ళతో నరికి చంపిన సోదరులు

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2023 (15:24 IST)
మహారాష్ట్రలో పరువు హత్య జరిగింది. కులాంతర వివాహం చేసుకున్న తమ సోదరిని ఇద్దరు సోదరులు కలిసి వెంటాడి, వేటాడి గొడ్డళ్ళతో నరికి చంపేశారు. మానవత్వానికే మచ్చతెచ్చే ఈ దారుణం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సోయగావ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో మాయత్‌ చంద్రకళ అనే యువతి వేరే కులానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. దీన్ని ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఆమె తాను ప్రేమించిన వ్యక్తితో అతడి ఇంట్లోనే సహజీవనం చేస్తోంది. 
 
ఈ విషయం తెలుసుకున్న యువతి ఇద్దరు సోదరులు జీర్ణించుకోలేక పోయారు. ఆమెను చంపేందుకు గొడ్డళ్లతో బయలుదేరారు. ఈ విషయం తెలిసిన యువతి.. ఓ వ్యక్తి సహాయంతో సమీపంలో ఉన్న మేకల కొట్టంలో దాక్కుంది. ఆగ్రహంతో ఊగిపోతున్న నిందితులు.. ఆమె కోసం వెతికారు. 
 
అనంతరం మేకల కొట్టంలో దాక్కున్న ఆమెను పట్టుకుని గొడ్డళ్లతో దారుణంగా నరికారు. తీవ్రంగా గాయపడ్డ యువతి రక్తపు మడుగులో కొట్టుకుంటూ ప్రాణాలు విడిచింది. బాధితురాలికి సహాయం చేసిన వ్యక్తిపై కూడా నిందితులు దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు యువతి సోదరులతో పాటు ఆమె తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments