Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొడుకు కావాలన్న కోరికతో కూతుళ్లను అత్యాచారం చేసిన తండ్రి.. ఎక్కడ?

Advertiesment
crime
, శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (19:40 IST)
తన కుమారుడు కావాలన్న కోరికతో తన ఇద్దరు కుమార్తెలపై కన్నతండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. మాంత్రికుడి మాటలు నమ్మి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ కేసులో ఆ నీచ తండ్రికి జీవితకారాగారశిక్షను కోర్టు విధించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బీహార్ రాష్ట్రంలోని పాట్నాకు సమీపంలోని బక్సర్‌కు చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చాలా కాలంగా కుమారుడి కోసం ఎదురు చూస్తున్నారు. కుమారుడు కావాలంటో అజయ్ కుమార్ అనే మాంత్రికుడి వద్దకు వెళ్ళాలని బంధువు చెప్పాడు. దీంతో ఆ మాంత్రికుడిని ఆ దంపతులు కలిశారు. ఇద్దరు కుమార్తెల వల్లే కుమారుడు పుట్టడం లేదని నమ్మించాడు. పైగా, కొడుకు పుట్టాలంటే కూతుళ్లను రేప్ చేయాలని సలహా ఇచ్చారు. అప్పటి నుంచి ఆ తండ్రి కుమార్తెలపై లైంగికదాడికి పాల్పడుతూ చ్చాడు. వారికి తల్లి, ఆమె సోదరి కూడా సహకరించారు. 
 
కేవలం తండ్రి మాత్రమే కాకుండా, అపుడపుడు మాంత్రికుడు అజయ్ కుమార్ కుమార్ అత్యాచారం చేయసాగాడు. ఇలా వారిద్దరి పెట్టే లైంగిక వేధింపులను భరించలేని ఆ ఇద్దరు కుమార్తెలు... పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు పెట్టిన సమయానికి బాధితురాళ్ల వయసు 14, 16 సంవత్సరాలు మాత్రమే. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. కామాధులైన తండ్రికి, మాంత్రికుడికి జీవితకారాగార శిక్ష విధించగా, తల్లికి, ఆమె సోదరికి 20 యేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

థమ్స్ అప్, ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 అధికారిక పానీయ భాగస్వామి