Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకోమంటే తిరుపతి తీసుకొచ్చాడు, గది తీసుకుని గొంతు పిసికి చంపాడు

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (20:20 IST)
ఇంటి పక్కన యువకుడు. అందంగా ఉన్నాడు. మాటలు కలిపాడు. ఆమె సరేనంది. పరిచయం పెరిగింది. అతన్ని నమ్మింది. సర్వస్వం అర్పించింది. పెళ్ళి చేసుకోమంటే మాత్రం ఒప్పుకోలేదు ఆ యువకుడు. ఆమెను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్ళి హత్య చేశాడు. 

 
బీహార్ రాష్ట్రం గోపాల్ గంజి జిల్లాల్ మధుసారియా గ్రామానికి చెందిన రాజ్ దూత్ నివాసముంటున్నాడు. అతని ఇంటి పక్కనే కవితాకుమారి అనే యువతి ఉంది. ఇంటర్మీడియట్ మధ్యలోనే ఆపేసి ఇంటి దగ్గరే ఉంటోంది. 

 
రాజ్ దూత్ అందంగా ఉంటాడు. దీంతో కవితకుమారి అతనికి కనెక్టయ్యింది. ఇద్దరూ ప్రేమించుకోవడమే కాదు శారీరకంగా కూడా కలిశారు. దీంతో కవితకుమారి గర్భం దాల్చింది. పెళ్ళి చేసుకోమని కవితకుమారి ప్రాధేయపడింది. అయితే బయటకు తీసుకెళ్ళి పెళ్ళి చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. చిత్తూరులో తన ఫ్రెండ్ ఉన్నాడని తీసుకొచ్చాడు. శ్రీ వేంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల దగ్గరలో ఒక గదిని అద్దెకు తీసుకున్నాడు. 

 
తన బుద్ధిని బయటపెట్టాడు. అబార్షన్ చేసుకోవాలని కోరాడు. అయితే అందుకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఇంట్లో నిద్రిస్తుండగా పక్కా ప్రణాళికతో ఆమె గొంతు నులిమి చంపి పారిపోయాడు. 

 
ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసుల విచారణలో అడ్డంగా దొరికిపోయాడు. నిందితుడిని చిత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడిని నమ్మి తమ కూతురు ఇంటి నుంచి పారిపోయి వచ్చి శవమై మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments