ఖతర్నాక్ తెలివితేటలు... అమాయకుడిని చంపి తానే చనిపోయినట్టుగా వివాహిత నాటకం...

ఠాగూర్
గురువారం, 29 మే 2025 (09:10 IST)
ఓ వివాహిత ఖతర్నాక్ తెలివితేటలను ప్రదర్శించింది. దృశ్యం సినిమా స్ఫూర్తితో హత్యకు ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం అమాయకుడుని చంపేసి, తానే చనిపోయినట్టుగా ప్రణాళిక రచించింది. అయితే, ఆ ప్లాన్ బెడిసికొట్టడంతో పోలీసులకు చిక్కి, జైలు ఊచలు లెక్కిస్తుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గుజరాత్ రాష్ట్రంలోని సంతాల్‌పుర్ తాలూకా పరిధిలోని జఖోట్రా గ్రామానికి చెందిన గీతా అహిర్ (22) అనే వివాహితకు భరత్ (21) అనే యువకుడుతో వివాహేతర సంబంధం ఉంది. భర్తకు తెలియకుండా ప్రియుడుతో కలిసి రాజస్థాన్‌కు వెళ్లిపోవాలని ప్లాన్ చేసింది. ఇందుకోసం తాను చనిపోయినట్టుగా భర్తతో పాటు అందర్నీ నమ్మించాలని ప్లాన్, తన ప్లాన్‌ను కూడా ప్రియుడుకి వివరించగా, అతను కూడా అడ్డంగా తల ఊపాడు. 
 
తమ పథకం ప్రకారం మంగళవారం రాత్రి సమయంలో ఒంటరిగా వెళుతున్న హర్జీభాయ్ సోలంకీ(56) అనే వ్యక్తిని భరత్ అడ్డగించి ఇద్దరూ కలిసి హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతానికి తరలించారు. అదేరోజు రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోయాక గీత ఇంటి నుంచి బయటకు వచ్చింది. తాను చనిపోయినట్టుగా నమ్మించేందుకు ప్రియుడు భరత్‌తో కలసి హర్జీభాయ్ శవానికి తన బట్టలు వేసి కాళ్ళకు గజ్జలు తొడగింది. ఆ తర్వాత శవంపై పెట్రోల్ పోసి నిప్పంటించి, ఆ తర్వాత ఇద్దరూ కలిసి అక్కడ నుంచి పారిపోయారు. ఇద్దరూ కలిసి అక్కడ నుంచి పారిపోయారు. తన మరణవార్త తెలిసి కుటుంబ సభ్యులు ఇకపై గాలించరని గీత భావించింది.
 
అయితే అర్థరాత్రి ఇంట్లో గీత కనిపించకపోవడంతో భర్తతోపాటు ఇతర కుటుంబ సభ్యులంతా ఆందోళనకుగురయ్యారు. ఈ క్రమంలో గ్రామ శివార్లలో సగం కాలిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని చూసి అది గీతదేనని తొలుత భావించారు. అయితే కాస్త నిశితంగా పరిశీలించగా, అది పురుషుడు శవంగా ఉన్నట్టు అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
మొబైల్, ఇతర సాంకేతిక ఆధారాల సాయంతో గీత, భరత్‌లు జోధ్‌పూర్‌కు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తన ప్రియుడుతో ఎంజాయ్ చేయాలని భావించిన ప్రియురాలు ఇపుడు తన ప్రియుడుతో కలిసి జైలు ఊచలు లెక్కిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments