Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆమె తల వేరు చేసి పెద్దమ్మ గుడి ముందు పెట్టివచ్చా, పోలీసుల ముందు కత్తితో నిందితుడు (video)

Advertiesment
Accused with knife

ఐవీఆర్

, మంగళవారం, 27 మే 2025 (16:17 IST)
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యంత భీతావహ హత్య జరిగింది. అందరూ చూస్తుండగానే ఓ రాక్షస యువకుడు ఓ మహిళ తల నరికేశాడు. ఆ తర్వాత నేరుగా పోలీసు స్టేషను వద్దకు వచ్చి లొంగిపోయాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండల కేంద్రంలో ఓ మహిళ పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళుతోంది. ఆ సమయంలో ఎక్కడ నుంచి వచ్చాడో తెలియదు కానీ యముడులా ఆమెపై కత్తితో దాడి చేసాడు. తల నరికేశాడు.
 
అసలేం జరుగుతుందో తెలుసుకునేలోపే మహిళ తలను వేరు చేసి చంపేసాడు. ఆ తర్వాత నేరుగా పోలీసు స్టేషను వెళ్లాడు. పెద్దమ్మ గుడి ఎదురుగా ఓ మహిళను చంపేసాను. ఆమె తలను వేరు చేసా, ఆమె చచ్చిపోయింది అంటూ తన చేతిలోని కత్తిని పోలీసుల ముందు పెట్టేసాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
 
ఈ నిందితుడు గతంలో కూడా వినాయక చవితి రోజున ఓ వ్యక్తిని హత్య చేసినట్లు తేలింది. మరి హత్య చేసిన వ్యక్తి ఇలా బయట ఎలా తిరుగుతున్నాడన్నది చర్చనీయాంశంగా మారింది. కాగా మహిళ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.3 వేలు చెల్లిస్తే చాలు.. యేడాదంతా ఫ్రీగా టోల్ పాస్