విడాకులు కోరిన భార్య... ప్రైవేట్ వీడియోలు షేర్ చేసిన భర్త!!

ఠాగూర్
సోమవారం, 3 ఫిబ్రవరి 2025 (12:54 IST)
గుజరాత్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. యేడాది క్రితం వివాహమైన ఓ జంటకు మనస్పర్థలు తలెత్తాయి. దీంతో భార్య విడాకులు కోరింది. దీంతో ఆగ్రహించిన భర్త... ఆమె ప్రైవేట్ వీడియోలను ఆన్‌లైన్‌లో షేర్ చేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కథనం వివరాలను పరిశీలిస్తే, ఈ జంటకు యేడాది క్రితమే వివాహమైంది. అయితే, ఆ తర్వాత కొంతకాలం నుంచే వీరి మధ్య విభేదాలు పొడసూపడంతో వేర్వేరుగా ఉంటున్నారు. ఆమె తిరిగి తన పుట్టింటికి వెళ్లిపోయింది.
 
ఇక కలిసి ఉండటం సాధ్యం కాదని భావించిన ఆమె (21) విడాకులు తీసుకుందామని ప్రతిపాదించింది. ఇది భర్తకు ఆగ్రహం తెప్పించింది. ఆమెపై కక్ష తీర్చుకోవాలని భావించి ఆమె ప్రైవేటు ఫొటోలు, వీడియోలను అసభ్య కామెంట్లతో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. 
 
ఆ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఇద్దరూ ఉపయోగిస్తుండటంతో ఆ వీడియోలు ఆమె కంటపడ్డాయి. వాటిని చూసి నిర్ఘాంతపోయింది. ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా? పూనమ్ కౌర్ ట్వీట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments