Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో దారుణం.. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. హత్య

Webdunia
సోమవారం, 31 జులై 2023 (08:36 IST)
కేరళ రాష్ట్రంలో మరో చిన్నారి కామాంధుడి చేతిలో బలైపోయింది. ఐదేళ్ల చిన్నారిపై ఓ వలస కూలీ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను చంపేశాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రాన్ని కుదిపేసింది. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
బీహార్‌కు చెందిన ఓ దంపతుల జంట బతుకుదెరువు కోసం ఎర్నాకుళం వచ్చారు. వీరి ఐదేళ్ల కుమార్తె శుక్రవారం అదృశ్యమైంది. తమ కుమార్తె కోసం తల్లిదండ్రులు విస్తృతంగా గాలించారు. ఫలితం లేకపోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 
 
ఇందులో బాలిక కుటుంబం ఉండే భవనంలో ఇటీవల చేరిన బీహారీ కూలీ అస్పబ్ అస్లాం ఆ బాలికను తన వెంట తీసుకెళ్లినట్టు గుర్తించారు. రాత్రి వేళ అతడిని కస్టడీలోకి తీసుకున్నా.. బాగా తాగి ఉండడంతో ఏమీ వెల్లడించలేదు. మత్తు దిగాక పోలీసులు విచారించడంతో నిజం కక్కాడు. బాలికను మార్కెట్ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడి గొంతు నులిమి హత్య చేసినట్లు అంగీకరించారు. 
 
నేరం చేసిన ప్రదేశానికి అతడిని తీసుకుని వెళ్లగా మృతదేహాన్ని సంచిలో కుక్కి దానిపై చెత్త పోసి బస్తాలు పరిచిన దృశ్యం కనిపించింది. కాగా, చిన్నారి ఆచూకీ తెలపాలంటూ శుక్రవారం రాత్రంతా సోషల్ మీడియా హోరెత్తింది. ప్రయత్న లోపం లేకున్నా, ఆమెను కాపాడలేకపోయామంటూ పోలీసులు విచారం వ్యక్తం చేశారు. బాలికను అస్సఖ్ మధ్యాహ్నం ఎత్తుకెళ్లి సాయంత్రం చంపేశాడని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments