Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐదేళ్ల బాలికపై యువకుడి అత్యాచారం.. పట్టుకోబోతే... బండరాయితో తలపై కొట్టి...

crime
, బుధవారం, 14 జూన్ 2023 (09:52 IST)
హైదరాబాద్ నగరంలోని నల్లకుంటలో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. దీన్ని గమనించిన స్థానికులు ఆ కామాంధుడుని పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా పెట్రేగిపోయిన ఆ కామాంధుడు బండరాయితో ఆ చిన్నారి తల, కన్నుపై కొట్టాడు. ఈ ఘటనలో ఆ బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
రాయలసీమ ప్రాంతానికి చెందిన దంపతుల జంటకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని భార్యాపిల్లలను వదిలివేసి వెళ్లిపోయాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి జీవనోపాధి కోసం హైదరాబాద్ నగరంలోని కాచిగూడకు చేరుకుంది. రైల్వే స్టేషన్‌లో తన యాచకవృత్తి చేసుకుంటూ ముగ్గురు పిల్లలను పోషించుకుంటుంది. 
 
ఈ క్రమంలో మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో ఐదేళ్ల పెద్ద కుమార్తె నీళ్లు తెచ్చేందుకు రైల్వే స్టేషన్‌లోనే మరో చోటికి వెళ్లింది. అలా వెళ్ళిన కుమార్తె అర్థగంట అయినా రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి.. నల్లా వద్దకు వెళ్లి చూడగా అక్కడ కుమార్తె కనిపించలేదు. పాపను ఓ యువకుడు ఎత్తుకొని వెళ్లాడం తాను చూశానంటూ ఆమెకు ఓ వ్యక్తి చెప్పడంతో వెంటనే కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. 
 
పోలీసులు సీసీ ఫుటేజీలు చూడగా బాలికను 25-30 ఏళ్ల యువకుడు ఎత్తుకొని పోతున్నట్లు కనిపించింది. పాపను ఆ యువకుడు నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రి ఎదురుగా ఉన్న నాలుగో వీధికి తీసుకెళ్లి రెండు వాహనాల మధ్య ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. పాప బిగ్గరగా రోదించడంతో స్థానికులు గమనించి అతడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. 
 
తనను పట్టుకుంటే పాపను చంపుతానని, ఓ బండ రాయితో చిన్నారి తల, ఎడమ కన్నుపై గట్టిగా కొట్టాడు. దీంతో పాపకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనాస్థలికి వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పాపను చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేశారు. 
 
పూజల పేరుతో మహిళలపై కీచక బాబా అత్యాచారం
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌లో ఓ కీచక బాబా వెలుగులోకి వచ్చాడు. కుటుంబ కలహాలు, భార్యాభర్తల తగాదాలు, ఆరోగ్య సమస్యలు తీర్చుతానంటూ స్థానికులను నమ్మించి, ఒంటరిగా ఉన్న మహిళలపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. తాజాగా పూజల పేరుతో ఓ మహిళను నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగు చూసింది. కీచక బాబా కటకటాల వెనక్కి వెళ్లాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, షైక్నాలో లేబ్బే అనే వ్యక్తి నాలుగు దశాబ్దాల క్రితం తమిళనాడు నుంచి వరంగల్‌కు వచ్చి స్థిరపడ్డాడు. తనకు మంత్రశక్తులు ఉన్నాయని స్థానిక ప్రజలను నమ్మించాడు. ప్రత్యేకంగా పూజలు చేసి, తాయెత్తులు కట్టడం ద్వారా కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, అనారోగ్య సమస్యలు పరిష్కరిస్తారంటూ ప్రచారం చేసుకున్నాడు. ఈ క్రమంలో తనను ఆశ్రయించిన పలువురు యువతులు, వివాహితలకు డబ్బు ఆశ చూపి అత్యాచారానికి పాల్పడసాగేవాడు. 
 
ఇటీవల ఓ మహిళపై కన్నేసి, ప్రత్యేక పూజలు చేస్తున్నట్టు నటించిన ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు, టాస్క్‌‍ఫోర్స్ పోలీసులను ఆశ్రయించింది. ఆ వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. అతడి వద్దకు ఓ మహిళను పంపారు. పూజల పేరుతో ఆమెతో వెకిలి చేష్టలు చేస్తుండగా కీచక బాబాను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కీచక బాబా నుంచి ఎర్రదారాలు, నల్లదారాలు, తాయత్తులు, నిమ్మకాయలు, దిష్టి గురుగులు, వనమూలికలు, నూనె డబ్బాలతో పాటు రూ.25 వేల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంచుకొస్తున్న బిపర్‌జాయ్ తుఫాను ముప్పు - గుజరాత్ హైఅలెర్ట్