Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్యాన్సర్ పై పోరాడి విజయం సాధించిన వారికి మద్దతుగా హైదరాబాద్‌లో 'హెయిర్ డొనేషన్ డ్రైవ్'ని నిర్వహించిన మిలాప్

Advertiesment
image
, సోమవారం, 12 జూన్ 2023 (17:45 IST)
బెంగళూరులో విజయవంతమైన హెయిర్ డొనేషన్ క్యాంప్ తర్వాత, భారతదేశంలోనే అతిపెద్ద క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫారమ్ మిలాప్, హైదరాబాద్‌లో తమ హెయిర్ డొనేషన్ డ్రైవ్‌లో రెండవ రౌండ్‌ను నిర్వహించింది. క్యాన్సర్ పై పోరాడి విజయం సాధించిన వారి అవసరాలపై అవగాహన కల్పించి, వారి శ్రేయస్సుకు అర్థవంతంగా దోహదపడేలా ‘హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్’, ‘హైదరాబాద్ హెయిర్ డొనేషన్’ సహకారంతో నగరంలోని వాలంటీర్లకు ఈ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమం ఒక భాగస్వామి యొక్క విగ్ తయారీ కేంద్రంలో నిర్వహించబడింది, ఇక్కడ సేకరించిన జుట్టును విగ్‌లుగా తయారు చేసి అవసరమైన రోగులకు పంపిణీ చేస్తారు.
 
మిలాప్ ప్రెసిడెంట్ మరియు కో-ఫౌండర్ అనోజ్ విశ్వనాథన్ మాట్లాడుతూ, “ప్రజలు ఒకరికొకరు, వారు చేయగలిగిన రూపంలో సహాయం చేయటానికి ముందుకు రావటం చాలా సంతోషాన్నిస్తుంది. క్యాన్సర్ అనేది ఒక దీర్ఘకాలిక పరిస్థితి, దీనికి  ప్రియమైనవారి నుండి నిరంతర మద్దతు మరియు ప్రేరణ అవసరం, వీటన్నిటికీ మించి కఠినమైన వైద్య చికిత్స కూడా అవసరం పడుతుంది. నగరంలోని మా భాగస్వాములు మరియు వాలంటీర్‌లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.." అని అన్నారు. 
 
webdunia
2020లో ప్రారంభమైన హైదరాబాద్ హెయిర్ డొనేషన్‌ను నిర్వహిస్తున్న ప్రసిద్ధ నగర స్టైలిస్ట్ శివ ప్రసాద్ కూడా ఈ కారణానికి మద్దతుగా ఉన్నారు. అతను సేకరించిన వెంట్రుకలతో తయారు చేసిన విగ్గులను అవసరమైన రోగులకు పంపుతున్నారు. శివ తన ప్రయత్నాల ద్వారా అనేక మంది జీవితాలను స్పృశించారు. క్యాన్సర్ పైన అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నారు హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థకు నాయకత్వం వహిస్తున్న హిమజా రెడ్డి కూడా ఈ రోజు నిర్వహించిన హెయిర్ డొనేషన్ డ్రైవ్‌లో భాగమయ్యారు. 
 
హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో, తన మామగారికి కూడా అదే వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ కావడంతో, ఇతర క్యాన్సర్ రోగులకు సంఘీభావం తెలిపేందుకు మహాలక్ష్మి అనే నడివయస్కురాలు తొలిసారిగా తన జుట్టును దానం చేశారు. ఈ కార్యక్రమంలో 5 సంవత్సరాల వయస్సు ఉన్న అమ్మాయిలు మార్పును తీసుకురావడానికి ఉత్సాహంతో పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రధాని మోడీపై అమిత్ షాకు కోపమెందుకు వచ్చింది? సీఎం స్టాలిన్