ఐదు నెలలుగా 15 ఏళ్ల బాలికపై ఐదుగురు కామాంధులు అత్యాచారం

ఐవీఆర్
బుధవారం, 4 జూన్ 2025 (12:51 IST)
గత ఐదు నెలలుగా 15 ఏళ్ల బాలికపై ఐదుగురు కామాంధులు తరచూ అత్యాచారం చేసిన ఘటన వెలుగుచూసింది. ఈ ఐదుగురు కామాంధుల్లో ఇద్దరు మైనర్లు వున్నారు. కర్నాటకలోని బెళగావి పోలీసు కమీషనర్ వెల్లడించిన వివరాలు ఇలా వున్నాయి. 15 ఏళ్ల బాలిక స్నేహితుడైన ఓ యువకుడు ఆమెను గత జనవరి నెలలో సమీపంలోని తోట ప్రాంతానికి తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆమెను లొంగదీసుకుని అత్యాచారం చేసాడు. ఈ సమయంలో జరిగినదంతా వీడియో తీసాడు.
 
అంతటితో ఆగకుండా ఆ వీడియోను తన స్నేహితులకు షేర్ చేసాడు. వాళ్లలో నలుగురు ఆ వీడియోలను బాధితురాలికి చూపిస్తూ... తమ కోర్కె తీర్చకపోతే వీడియోలు బైటపెడతామంటూ బెదిరించారు. దీనితో బాధిత బాలిక భయపడిపోయి వారు చెప్పినట్లే చేసింది. అలా మొత్తం ఐదుగురు కామాంధులు ఎప్పుడుబడితే అప్పుడు బాధిత బాలికకు ఫోన్ చేసి రప్పించుకుంటూ అత్యాచారం చేయడం చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని బైటకు చెబితే తల్లిదండ్రులను చంపేస్తామని కూడా భయపెట్టారు. దానితో బాధితురాలు విషయాన్ని దాచిపెట్టింది.
 
ఐతే గత నాలుగు రోజులుగా బాలిక తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో బాధిత బాలిక వద్ద ఆరా తీసారు. దాంతో తనపై ఐదుగురు కామాంధులు చేస్తున్న దారుణాన్ని వెల్లడించింది. కుమార్తె చెప్పిన విషయాలు విని షాక్ తిన్న ఆమె పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. తమ కుమార్తెపై జరుగుతున్న లైంగిక దాడి చేస్తున్న వ్యక్తుల వివరాలను కూడా ఇచ్చారు. మొత్తం ఐదుగురు వ్యక్తుల్లో ముగ్గురు మేజర్లు కాగా ఇద్దరు మైనర్లు వున్నారు. మేజర్లయిన నిందితులను రిమాండుకి తరలించి మైనర్లను జువనైల్ హోంకి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం