భూకబ్జా చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. జగన్ ఈనో వాడండి: నారా లోకేష్

సెల్వి
బుధవారం, 4 జూన్ 2025 (12:31 IST)
వైకాపా జగన్మోహన్ రెడ్డికి ఏపీ మంత్రి నారా లోకేష్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. విశాఖలో తాను భూకబ్జా చేసినట్లు జగన్ నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని నారా లోకేష్ సవాల్ చేశారు. ఒక్క రూపాయికి ఎకరం భూమి కట్టబెట్టినట్లు నిరూపించాలని, ఒకవేళ ఆ ఆరోపణలు అబద్ధమని తేలితే యువతకు జగన్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 
 
ఇంకా నారా లోకేష్ మాట్లాడుతూ.. ఆరోపణలు చేయడం, పారిపోవడం జగన్ రెడ్డికి కొత్తేమీ కాదని తెలిపారు. ఉర్సా కంపెనీకి విశాఖలో ఎకరం రూపాయికే భూములు కట్టబెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఉర్సా కంపెనీకి విశాఖలోని ఐటీ పార్ట్ హిల్ -3లో ఎకరం కోటి రూపాయలు చొప్పున మూడున్నర ఎకరాలు కేటాయించామని, కాపులుప్పాడలో ఎకరం యాభై లక్షల చొప్పున 56.36 ఎకరాలు కేటాయించాం. 
 
కాపులుప్పాడలో ఎకరం యాభై లక్షల చొప్పున 56.36 ఎకరాలు కేటాయించాం. బురదజల్లి ప్యాలస్‌లో దాక్కోవడం కాదు.. చేసిన ఆరోపణలు నిరూపించండి. ఛాలెంజ్‌కు సిద్ధమా జగన్ రెడ్డి?' అని ప్రశ్నించారు. అలాగే ఐదేళ్ల విధ్వంస పాలనలో ఒక్క కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీలను ఇతర రాష్ట్రాలకు తరిమేశారని చెప్పారు. 
 
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నామని వెల్లడించారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబడుతున్నాం. కంపెనీలు రావడం, యువతకు ఉద్యోగ అవకాశాలు రావడం చూసి మీరు తట్టుకోలేకపోతున్నారు. ఈనో వాడండి కాస్త రిలీఫ్ వస్తుందని తీవ్ర విమర్శలు చేశారు లోకేష్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments