Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైసూరులో విషాదం.. తల్లి, భార్య, కుమారుడికి విషమిచ్చి చంపేసి.. తానూ...

ఠాగూర్
సోమవారం, 17 ఫిబ్రవరి 2025 (13:39 IST)
కర్నాటక రాష్ట్రంలోని మైసూరులో ఓ విషాదకర ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి నలుగురు సభ్యులు విగతజీవులుగా కనిపించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారు ప్రాణాలు కోల్పోయినట్టు భావిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలను పరిశీలిస్తే, 
 
మైసూర్‌లోని విశ్వేశ్వరయ్య నగర్‌లోని సంకల్ప్ సెరీన్ అపార్టుమెంటులో చేతన్ (45) అనే వ్యాపారి తన భార్య రూపాలి (43), కుమారుడు కుశాల్ (15), చేతన్ తల్లి ప్రియంవద (65) అప్పుల వారి బాధ భరించలేక బలవంతంగా తనువు చాలించారు. భార్య, కుమారుడు, తల్లికి విషం ఇచ్చి చంపిన తర్వాత చేతన్ ఉరేసుకుని ప్రాణాలు తీసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
అయితే, చేతన్ ఆత్మహత్య చేసుకునేందుకు ముందు అమెరికాలో ఉన్న తన సోదరుడుకి ఫోన్ చేసి, తాము ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పి, ఫోన్ కట్ చేశాడని పోలీసులు తెలిపారు. దాంతో అతని సోదరుడు పలుమార్లు తిరిగి కాల్ చేశాడు. కానీ, ఎలాంటి స్పందన రాలేదు. దీంతో స్థానికంగా ఉండే తమ బంధువులకు సామాచారం చేరవేయగా, వారు అపార్టుమెంటుకు వెళ్ళి చూడా నలుగురు విగతజీవులుగా పడివున్నారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. 
 
అయితే, చేతన్ కుటుంబం గత పదేళ్ళుగా ఇక్కడే ఉంటున్నారని, వారు ఎపుడూ ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్టుగా కనిపించలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

ఎన్నో అడ్డంకులు అధిగమించి రాబోతున్న హరిహర వీరమల్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments