న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట చోటుచేసుకోగా, ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిసంఖ్య 18కు చేరింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నట్టు రైల్వే శాఖ తెలిపింది కుంభమేళా గడువు సమయం సమీపిస్తుండంతో ప్రయాగ్ రాజ్ వెళ్లి, పుణ్యస్థానాలు ఆచరించారని భావించే భక్తులు రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో రైలు కోసం ప్రయాణికులు పోటెత్తారు. ఫలితంగా గురువారం సాయంత్రం ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. మృతుల్లో 10 మంది మహిళలతో పాటు ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ మృతుల కుటుంబాలకు రైల్వేశాఖ రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది.
ప్రయాగ్ రాజ్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు 14వ నంబరు ఫ్లాట్‌ఫాంపై ఉండటంతో కుంభమేళా వెల్లే భక్తులు అక్కడకు ఒక్కసారిగా భారీగా చేరుకున్నారు. అయితే, కుంభమేళాకే వెళ్లే స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు కూడా అదే సమయంలో 12, 13, 14 నంబర్ ఫ్లాట్‌ఫాంపై ఉడటంతో ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.
ఈ ఘఠనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులను త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే, కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. ఈ ఘటనపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించినట్టు తెలిపారు.