Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కారును ఢీకొన్న లారీ.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మణం

Advertiesment
road accident

ఠాగూర్

, ఆదివారం, 16 ఫిబ్రవరి 2025 (11:41 IST)
పల్నాడు జిల్లా రాజుపాలెం మండల నెమలిపురి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఓ కారును లారీ ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతులను ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ నజీయా, ఆమె కుమారులు నూరుల్లా, హబీబుల్లాగా గుర్తించారు. 
 
వీరి హైదరాబాద్ నగరం నుంచి స్వగ్రామానికి కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 


తెనాలిలో కాకినాడ యువకుడి కిడ్నాప్ - కరెంట్ షాక్‌తో చిత్రహింసలు 

గుంటూరు జిల్లా తెనాలిలో కాకినాడ యువకుడు కిడ్నాప్‌ చేసి కరెంట్ షాక్‌తో చిత్రహింసలు పెట్టాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలన పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలో వ్యాపారం చేస్తున్న తెనాలికి చెందిన మణిదీప్ వద్ద కాకినాడ పెద్దాపురానికి చెందిన సతీశ్ అనే యువకుడు గతంలో పనిచేసి మానేశాడు. ఆ సమయంలో అతడికి రెండు నెలల వేతనం మణిదీప్ ఇవ్వాల్సివుంది. దీంతో వాటి కోసం సతీశ్ తరచుకూ మణిదీప్‌కు ఫోన్ చేస్తుండేవాడు. 
 
ఈ క్రమంలో తాజాగా మరోమారు ఫోన్ చేయడంతో విజయవాడ వచ్చి తీసుకెళ్లాలని మణిదీప్ చెప్పాడు. దీంతో అతని మాటలు నిజమని నమ్మి శుక్రవారం సాయంత్రం విజయవాడకు వచ్చిన సతీశ్‌ను మణిదీప్‌తో సహా మరో నలుగురు బలవంతంగా కారులో ఎక్కించుకుని తెనాలి తీసుకెళ్లారు. మార్గమధ్యంలో అతడిపై అందరూ కలిసి దాడిచేశారు. ఆ తర్వాత ఓ ఇంట్లోకి తీసుకెళ్లి కరెట్ షాక్ ఇచ్చి బంధించారు.
 
ఆ తర్వాత సతీశ్‌ను అర్థరాత్రి కారులో ఎక్కించుకుని తీసుకెళతుండా తెనాలి - గుంటూరు వంతెనపై పోలీసులు వాహనం వస్తుండటంతో బాధితుడు కేకలు వేశాడు. దీంతో నిందితులు కారు ఆపడంతో సతీశ్ వెంటనే బయటకుదూకి పోలీసలకు విషయం చెప్పడంతో నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, మిగిలినవారు పారిపోయినట్టు సమాచారం. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్కంపల్లి రిజర్వాయర్ వద్ద బర్డ్ ఫ్లూ కేసులు - భయం గుప్పెట్లో భాగ్యనగరి వాసులు