Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పేరుతో ఇంజినీరింగ్‌ విద్యార్థినికి చిత్రహింసలు.. వేడి నూనె పోసి..

Webdunia
ఆదివారం, 23 ఏప్రియల్ 2023 (12:31 IST)
ప్రేమ పేరుతో ఓ యువకుడు ఇంజినీరింగ్‌ విద్యార్థినిని గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేశాడు. కాళ్లు, చేతులపై వేడి నూనె పోసి తీవ్రంగా గాయపరిచాడు. గాయపడిన ఆ యువతి ఆదివారం తెల్లవారుజామున తప్పించుకుని వచ్చి తల్లిదండ్రులకు విషయం తెలిపింది. దీంతో ఆమెను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
తాజాగా పోలీసులు వెల్లడించిన కథనం మేరకు.. ఏలూరులోని శనివారపుపేటకు చెందిన ఓ విద్యార్థిని కాకినాడ జేఎన్‌టీయూలో ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం విద్యాభ్యాసం చేస్తుంది. శనివారపుపేటకు సమీపంలోని దుగ్గిరాలకు చెందిన సదర్ల అనుదీప్‌ అనే యువకుడు ఆమెను ప్రేమ పేరుతో ఉచ్చులోకి లాగాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. సంవత్సర కాలంగా విద్యార్థినితో పరిచయం పెంచుకున్నాడు. 
 
ఈ క్రమంలోనే ఐదు రోజుల క్రితం విద్యార్థినిని దుగ్గిరాలలోని తన ఇంటికి తీసుకుని వచ్చాడు. రోజూ రాత్రి యువతిని చిత్రహింసలకు గురిచేశాడు. లైంగికంగా వేధించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. శనివారం అర్థరాత్రి దాటాక విద్యార్థినిని ఉరి వేసి చంపేందుకు సన్నాహాలు చేస్తుండగా.. ఆమె ఆ కిరాతకుడి నుంచి తప్పించుకుని, తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 
 
నిందితుడు అనుదీప్‌ పరారీలో ఉన్నాడని.. అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసైన అనుదీప్‌.. చాలా మంది అమ్మాయిలను ప్రేమ పేరుతో వంచించాడని చెప్పారు. ఏలూరు ఇన్‌ఛార్జ్‌ డీఎస్పీ పడేశ్వరరావు ఆదేశాల మేరకు మూడో పట్టణ సీఐ వరప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

వాస్తవ సంఘటనలకు అద్దం పట్టే మిస్టర్ మాణిక్యం గా సముద్రఖని

సింగర్ మంగ్లీకి ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ పురస్కారం ప్రదానం

దేవీశ్రీ ప్రసాద్ లేనిదే నా జర్నీ శూన్యం - నా లైఫ్ మార్చింది ఆ దర్శకుడే : తేల్చిచెప్పిన అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం