జమ్మూ-కాశ్మీర్ ప్రభుత్వం కథువా ప్రాంతంలోని ఒక ప్రభుత్వ పాఠశాలను పునరుద్ధరించడానికి చర్య తీసుకుంది. 3వ తరగతి విద్యార్థి తన పాఠశాలలో కనీస సౌకర్యాల కొరతను ఎత్తిచూపుతూ వీడియో సందేశంలో ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసింది.
సీరత్ నాజ్ సందేశం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జమ్మూలోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రవిశంకర్ శర్మ రిమోట్ లోహై-మల్హర్ బ్లాక్‌లో ఉన్న పాఠశాలను సందర్శించవలసి వచ్చింది.
సందర్శన తరువాత, పాఠశాల కొత్త సౌకర్యాలు, పరికరాలను ఏర్పాటు చేయడంతో ఆమె హర్షం వ్యక్తం చేసింది. సీరత్ విజ్ఞప్తికి ప్రతిస్పందనగా ప్రధాని మోదీ త్వరితగతిన చర్య తీసుకోవడంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.