Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళిలో విషాదం.. పటాసులు కాల్చుతూ బాలుడు మృతి

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2022 (10:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నంలో నవీన్ మిట్టల్ కాలనీలో దీపావళి పండుగ రోజున విషాదం నెలకొంది. పటాసులు కాల్చుతూ 11 యేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని వేమూరి లక్ష్మినరసింహారావుగా గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పులగుర్రతోనూ బాణాసంచా తయారు చేస్తుండగా ఒక్కరిగా నల్లమందు పేలిపోయింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో రామచంద్రాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. 
 
మరోవైపు, రాజమండ్రి ఆవరోడ్డు రైతు నగర్‌లో ఓ ఇంటిలో బాణాసంచా తయారు చేస్తుండగా మరో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కోటేశ్వర రావు అనే వ్యక్తి మృతి చెందాడు. మరికొందరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమైపోయింది. 
 
అటు తెలంగాణా రాష్ట్రంలోనూ పలు ప్రాంతాల్లో విషాదకర ఘటనలు చోటు చేసుకున్నాయి. తంగళ్లపల్లి టెక్స్ టైల్ పార్క్‌‌లోని పౌరసరఫరాల ప్రభుత్వ గిడ్డంగుల సముదాయంలోని ఓ గోదాంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. గోదాంలో ఉన్న గన్ని సంచులన్నీ పూర్తిగా దగ్ధమైపోయాయి. ఈ ప్రమాదంలో దాదాపు కోటి రూపాయల విలువ చేసే ఆస్తి నష్టం వాటిల్లింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments