Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ్ముడి కోసం వెళితే యువతిపై అత్యాచారం చేసిన డ్యాన్స్ మాస్టర్

Webdunia
శనివారం, 19 ఫిబ్రవరి 2022 (18:15 IST)
సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతి తమ్ముడు డ్యాన్స్ స్కూల్లో చేరాడు. తమ్ముడి కోసం వెళ్ళి వస్తున్న యువతికి డ్యాన్స్ మాస్టర్ దగ్గరయ్యాడు. ఆమెతో చనువుగా ఉంటూ వచ్చాడు. ఇంటికి పిలిచాడు. జ్యూస్‌లో మత్తు మందు ఇచ్చాడు. మత్తులో ఉండగానే ఆమెపైన అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఆమెను బెదిరించి లొంగదీసుకుని ఎంజాయ్ చేశాడు. వీడియోలు తీశాడు. కానీ చివరకు..

 
చెన్నైలోని మేడవాక్కం ఏరియాలో నివాసముంటున్న వినోదా అనే యువతి తన తమ్ముడు రాకేష్‌ను డ్యాన్స్ స్కూలుకు తీసుకెళుతూ ఉండేది. అక్కడ ప్రభు అనే డ్యాన్స్ మాస్టర్ పరిచయ్యాడు. ఆమెను ఎలాగైనా లోబరుచుకోవాలని భావించాడు ప్రభు. 

 
తన పుట్టినరోజు ఉందని నాలుగునెలల క్రితం ఇంటికి పిలిపించుకున్నాడు. జ్యూస్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. ప్రభుకు అతని తల్లి సహకరించింది. అంతటితో ఆగలేదు. ఆ తరువాత ఆమెను బెదిరించి కోర్కె తీర్చుకోవడం ప్రారంభించాడు. ఫలితంగా ఆ యువతి గర్భవతి అయ్యింది. అంతకుముందే ఆమెతో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను కెమెరాలో చిత్రీకరించాడు.

 
ఎక్కడైనా విషయం చెబితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె గర్భవతి అయినా కూడా లోలోపల ఆవేదనకు గురైంది. ప్రభును పెళ్ళి చేసుకోమని ప్రాధేయపడింది. అయితే ప్రభు ఒప్పుకోకపోవడంతో ఇంటిలో ఆత్మహత్య చేసుకుంది. ఆమె గర్భవతి అనే విషయం చనిపోయిన తరువాత వినోదా తల్లిదండ్రులకు తెలిసింది.

 
సుసైడ్ లేఖలో ఆమె అన్ని విషయాలు రాయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో వినోదా తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. నిందితుడు ప్రభును కఠినంగా శిక్షించాలని వినోదా తల్లిదండ్రులు పోలీసులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం