Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిజాబ్ ధరించి వచ్చి ఓటేసేందుకు వచ్చిన మహిళను అడ్డుకున్న బీజేపీ ఏజెంట్

Webdunia
శనివారం, 19 ఫిబ్రవరి 2022 (17:57 IST)
తమిళనాడు రాష్ట్రంలో నగర, పురపాలక, పట్టణ పంచాయతీలకు శనివారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్ర ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. అంతా ప్రశాంతంగా సాగుతుందని భావించిన తరుణంలో మదురైలో హిజాబ్ వివాదం చెలరేగింది. పోలింగ్ కేంద్రానికి హిజాబ్ ధరించి వచ్చిన ఓ ముస్లిం మహిళను ఓటు వేయకుండా బీజేపీ అభ్యర్థి తరపు ఏజెంట్ అడ్డుకున్నారు. దీంతో పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత ఏర్పడింది. 
 
హిజాబ్ తొలగించిన తర్వాత తర్వాతే ఆ మహిళ ఓటు వేయాలని, అపుడే ఓటు వేయడానికి అనుమతించాలంటూ బీజేపీ ఏజెంట్ పోలింగ్‌ బూత్‌లో వీరంగం సృష్టించాడు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత డీఎంకే, అన్నాడీఎంకే సహా ఇతర పోలింగ్ ఏజెంట్లు సదరు బీజేపీ ఏజెంట్‌ను పోలింగ్ బూత్ నుంచి బయటకు పంపించాలంటూ డిమాండ్ చేయడంతో పోలీసులు జోక్యం చేసుకుని బీజేపీ ఏజెంట్‌ను బయటకు పంపించారు. ఆ తర్వాత ఆ మహిళ ఓటు హక్కును వినియోగించుకుంది. కాగా, కర్నాటక రాష్ట్రంలో తలెత్తిన హిజాబ్ వివాదం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పాకింది. ఇపుడు తమిళనాడు ఎన్నికల్లో ఈ వివాదం తలెత్తింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments