Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా టెక్కీని సజీవదహనం చేసిన ప్రియుడు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 25 డిశెంబరు 2023 (17:58 IST)
చెన్నై నగర శివారు ప్రాంతంలో ఓ మహిళా టెక్కీని ఆమె ప్రియుడే సజీవదహనం చేశారు. శనివారం అర్థరాత్రి ఈ దారుణం జరిగింది. సమాచారం అందుకున్న తాళంబూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా ప్రియుడే హంతకుడని తేలింది. చెన్నై పెరుంగుడి ప్రాంతంలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, చెన్నై సిరుచ్చేరి ఐటీ పార్కులో నందిని (25) ఓ ఐటీ కంపెనీలో పని చేస్తుంది. ఈమె మాజీ ప్రియుడు వెట్రి మణిమారన్‌ ఈ దారుణానికి పాల్పడినట్టు తేలింది. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 
 
మదురైలోని హైస్కూల్ నుంచి నిందితుడు వెట్రిమారన్‌తో నందిని స్నేహంగా మెలుగుతూ వచ్చింది. వెట్రిమారన్ తిరువళ్లూరు జిల్లా ముప్పేడులో నివాసం ఉంటుండగా, నందిని మాత్రం కన్నగి నగర్‌లోని అత్త ఇంట్లో ఉంటూ ఓ ఐటీ కంపెనీలో పని చేస్తుంది. పైగా, వెట్రిమారన్‌తో ఉన్న పాతకాలపు స్నేహబంధాన్ని కూడా తెంచుకుంది. అయితే, వెట్రిమణిమారన్ ఓ ట్రాన్స్‌జెండర్ అని తేలడంతో అతన్ని దూరంగా పెట్టిన నందిని.. రాహుల్ అనే వ్యక్తిని ప్రేమించసాగింది. ఈ విషయాన్ని  తెలుసుకున్న మణిమారన్ జీర్ణించుకోలేక ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
శనివారం నందిని పుట్టిన రోజు కావడంతో సర్‌ప్రైజ్ ఇస్తామని నమ్మించి ఓ ప్రదేశానికి పిలిపించి రాత్రి 7.15 గంటల ప్రాంతంలో హత్యకు పాల్పడ్డాడు. ముందుగా ఆమె కళ్లకు గంతలు కట్టి..  ఆ తర్వాత కాళ్లు చేతులు కట్టేసి... బహుమతి ఇస్తానని చెప్పి ఖాళీ ప్లాట్‌లోకి తీసుకెళ్లి మణికట్టు, చీలమండలను కోసి, ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత నిందితుడు అక్కడ నుంచి పారిపోయాడు. స్థానికులు అందించిన సమాచారంతో 
 
అక్కడకు చేరుకున్న పోలీసులు... మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టిన మణిమారన్‌ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments