Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దపల్లిలో యువకుడి దారుణ హత్య (Video)

ఠాగూర్
సోమవారం, 28 ఏప్రియల్ 2025 (17:25 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో పట్టపగలే ఓ దారుణ హత్య జరిగింది. అప్పన్నపేట గ్రామానికి చెందిన పొలం కుమార్‌ను ధర్మారం మండలం దొంగతూర్తి గ్రామానికి చెందిన వేల్పుల సంతోష్ అనే వ్యక్తి మెడపై కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. 
 
ఈ దాడిలో కుమార్ చనిపోయిన తర్వాత కూడా అతడి మృతదేహంతో పాటు ప్రైవేట్ భాగంపై కాలితో తన్నుతూ వికృతానందం పొందాడు. పోలీసులు నిందితుడుతో పాటు మరో మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. 
 
కాగా, మృతుడుతో పాటు ఉన్న మహిళ కూడా కత్తిగాయాలయ్యాయి. దీంతో ఆమె అపస్మారకస్థితిలోకి జారుకుంది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
లిఫ్టులో కిరాతకంగా వ్యక్తి హత్య.. బ్యాంకు భవనంలో దారుణం! 
 
హైదరాబాద్ నగరంలోని హిమాయత్ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు హిమాయత్ నగర్ శాఖ భవనంలో గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. హంతకులు మృతదేహాన్ని భవనం లిఫ్టులో వదిలి పరారయ్యారు. ఉదయం బ్యాంకుకు చేరుకున్న సిబ్బందికి లిఫ్టులో మృతదేహం కనిపించడంతో భయాందోళనలకు గురయ్యారు. వారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు పలు సూచనలు చేసారు. మృతదేహాన్ని పరిశీలించిన  పోలీసులు.. అత్యంత కిరాతకంగా ఈ హత్య జరిగిందని, పాత కక్షల కారణంగానే హత్య జరిగివుంటుందని భావిస్తున్నారు. మృతుడుకి సంబంధించిన వివరాలు, హంతకుడి ఆచూకీ కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments