Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బస్సులో నిద్రపోతున్న యువతిని తాకరాని చోట తాకుతూ లైంగికంగా వేధించిన కండక్టర్ (video)

Advertiesment
KSRTC Conductor sexually harasses sleeping woman

ఐవీఆర్

, శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (13:36 IST)
బస్సులో నిద్రపోతున్న యువతిని తాకరాని చోట తాకుతూ లైంగికంగా వేధించాడు కేఎస్ఆర్టీసీ బస్సు కండక్టర్. ప్రయాణికులు బస్సులో ప్రయాణించేటపుడు వారికి ఎలాంటి అసౌకర్యం కలగుకుండా చూడాల్సిన కండక్టరే కామాంధుడుగా మారాడు. కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని ముడిపు-స్టేట్ బ్యాంక్ మార్గంలో నడిచే కేఎస్ఆర్టీసీ బస్సులో పనిచేస్తున్న కండక్టర్ ఓ యువతి నిద్రపోతుండగా ఆమె పక్కనే వచ్చి నిలబడి ఆమెను పదేపదే తాకరాని చోట టచ్ చేస్తూ లైంగికంగా వేధించాడు.
 
కండక్టర్ చేస్తున్న ఈ వేధింపును గమనించిన తోటి ప్రయాణీకుడు తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసాడు. ఈ వీడియో కాస్తా వైరల్ అయింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే కండక్టర్‌ను విధుల నుంచి తొలగిస్తూ కేఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకున్నది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Indus Waters Treaty పాకిస్తాన్ పీచమణచాలంటే సింధు జల ఒప్పందం రద్దు 'అణు బాంబు'ను పేల్చాల్సిందే