Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బైకుపై వెళుతున్న దంపతులు.. నిర్మానుష్య ప్రాంతానికి చేరుకోగానే....

Advertiesment
Chain snatching
తెలంగాణ రాష్ట్రంలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చైన్ స్నాచింగ్ ఘటన ఒకటి చోటుచేసుకుంది. బైకుపై వెళుతున్న దంపతులను వెంటాడిన ఓ దొంగ... నిర్మానుష్య ప్రాంతానికి చేరుకోగానే ఆ మహిళ మెడలోని మంగళసూత్రాన్ని లాక్కెళ్లాడు. ఆ వెంటనే తేరుకున్న ఆ మహిళ భర్త తన బైకుతో దొంగను ఛేజ్ చేశాడు. కీసరలో స్థానికుల సాయంతో ఆ దొంగను పట్టుకుని చితకబాదారు. ఆపై స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు. 
 
కీసర నుంచి యాదగిరిపల్లెకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుని బాధితురాలు చింతల పద్మ వెల్లడించారు. భర్తతో కలిసి బైకుపై వెళుతుంటే వెనుక నుంచి వచ్చిన దొంగ మెడలోని 4 తులాల మంగళసూత్రాన్ని లాక్కెళ్లాడని చెప్పారు. పద్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉగ్రదాడికి పాల్పడిన వారికి.. కుట్రదారులకు కఠిన శిక్ష తప్పదు : ప్రధాని మోడీ హెచ్చరిక